HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Technology
  • ⁄Samsung Galaxy A14 5g Launched In India Check Here For Price Sale Date Features And Specification

Samsung Galaxy A14 5G: శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం

  • By Nakshatra Published Date - 07:30 AM, Tue - 7 March 23
Samsung Galaxy A14 5G: శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లోనే మార్కెట్లోకి విడుదల చేస్తూనే మరోవైపు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోని తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ని కూడా విడుదల చేసింది శాంసంగ్ సంస్థ. శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ధర రూ. 18,999 గా ఉంది.

కాగా 8జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 20,999గా ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ మనకు డార్క్ రెడ్, లైట్ గ్రీన్, బ్లాక్ వంటి 3 కలర్స్‌లో లభిస్తోంది. ఈ నెల 20 నుంచి https://www.samsung.com/ , శాంసంగ్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ స్టోర్స్ తో పాటు వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లల్లో అందుబాటులో ఉండనుంది. కాగా శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 167.7 మిల్లీ మీటర్ల పొడవు, 78.0 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.1 మిల్లీ మీటర్ల మందంతో పాటు 202 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.0 కస్టమ్ స్కిన్‌పై పని చేస్తుంది.

ఇందులో 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచ్ హెచ్‌ డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇంకా ఇందులో ఎక్సినోస్ 1330 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో కూడిన 16జీబీ ర్యామ్ ఉండటం విశేషం. ర్యామ్ ప్లస్ ఫీచర్ కారణంగా.. అదనంగా వర్చువల్ ర్యామ్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ లో ప్రైవేట్ షేర్ అనే ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా నాలుగేళ్ల పాటు ఈ ఫీచర్‌కు సెక్యూరిటీ అప్డేట్స్, 2 ఓఎస్ అప్గ్రేడ్స్ రానున్నాయని సామ్సంగ్ తెలియజేయడం విశేషం. ఇక కెమెరా విషయానికి వస్తే.. 50 ఎంపీ ట్రిపుల్ లెన్స్ రేర్ కెమెరా ఉంటుంది. 13 ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ను కలిగిఉండనుంది.

Telegram Channel

Tags  

  • features
  • price
  • Samsung Galaxy A14 5G
  • Samsung Galaxy A14 5G smart phone
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Ramayanam: రామాయణం విశేషాలు

Ramayanam: రామాయణం విశేషాలు

తండ్రి ఆజ్ఞతో వనవాసానికి సిద్ధమైన శ్రీరామచంద్రమూర్తి శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణస్వామిలను వెంటబెట్టుకుని రకరకాల ప్రాంతాలు అడవులు, ఆయాప్రాంతాల్లో ఆలయాలు..

  • Vishnu Matsya Avatara: మత్స్య జయంతి, విష్ణువు మత్స్యావతార విశేషాలు

    Vishnu Matsya Avatara: మత్స్య జయంతి, విష్ణువు మత్స్యావతార విశేషాలు

  • Itel P40: మార్కెట్ లోకి రూ.7 వేలకే సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే?

    Itel P40: మార్కెట్ లోకి రూ.7 వేలకే సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే?

  • ChatGPT: మనదేశంలోనూ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్.. ధర, ఎక్స్ ట్రా ఫీచర్స్ ఇవీ..!

    ChatGPT: మనదేశంలోనూ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్.. ధర, ఎక్స్ ట్రా ఫీచర్స్ ఇవీ..!

  • Honda Shine 100: మార్కెట్ లోకి మరో సరికొత్త హోండా బైక్ విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే?

    Honda Shine 100: మార్కెట్ లోకి మరో సరికొత్త హోండా బైక్ విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే?

Latest News

  • Horoscope 2023: బృహస్పతి అస్తమిస్తే.. ఈ 4 రాశుల వారి ఎదుట సమస్యల క్యూ

  • WPL Champions: WPL విజేత ముంబై ఇండియన్స్

  • Women’s World Boxing Championship: నలుగురి పంచ్ బంగారమాయె

  • DeKock: ఛేజింగ్ లో సౌతాఫ్రికా వరల్డ్ రికార్డ్… సఫారీలదే రెండో టీ ట్వంటీ

  • AP CM Jagan: జగన్ మంచోడే.! సజ్జలే చేటు!! రెబెల్స్ వాయిస్

Trending

    • World Boxing Championship: నిఖత్ గోల్డెన్ పంచ్

    • Sunday Special: సండే వెరైటీగా చికెన్ కర్రీ చేయాలని ఉందా..అయితే మంగళూరు స్టైల్ చికెన్ గీ రోస్ట్ రిసిపీ మీకోసం..

    • FD Rates: ఫిక్స్‎డ్ డిపాజిట్ చేసేవారికి గోల్డెన్ ఛాన్స్. 9.00శాతం వడ్డీని అందిస్తున్న చిన్న బ్యాంకులు

    • Business Idea : తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం. ఈ వ్యాపారానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది.నెలకు 15లక్షలు సంపాదించవచ్చు.

    • EPFO Recruitment 2023: ఈపీఎఫ్ఓలో 2,674ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్, ఏపీ, తెలంగాణలో ఎన్ని ఖాళీలున్నాయంటే.!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: