Realme Narzo 60 5G: రియల్ మీ నుంచి అద్భుతమైన స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ మాములుగా లేవుగా?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదా
- By Nakshatra Published Date - 07:30 PM, Fri - 7 July 23
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ సంస్థ ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రియల్మీ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్మీ నార్జో 60 సిరీస్ పేరుతో రెండు ఫోన్లను తీసుకొచ్చారు.
ఈ సిరీస్‌లో భాగంగా నార్జో 60, నార్జో 60 ప్రో ఫోన్లను లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్స్ ఫీచర్ల విషయానికొస్తే.. రియల్ మీ నార్జో 60లో 6.43 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేను అందించారు. ప్రో వేరియంట్లో మాత్రం 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోఎల్ఈడీ డిస్ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. నార్జో 60లో 33 వాట్, ప్రో వెర్షన్లో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే కెమెరాకు విషయానికి వస్తే.. 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు.
నార్జో 60ప్రోలో 100 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. రెండు స్మార్ట్ ఫోన్స్‌లో నూ 10 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఇకపోతే ధర విషయానికొస్తే.. రియల్ మీ నార్జో 60 ధరలు స్టోరేజ్ ఆధారంగా రూ. 17,999, రూ. 19,999గా ఉన్నాయి. ఇక నార్జో 60 ప్రో రూ. 23,999, రూ. 26,999, రూ. 29,999గా ఉన్నాయి.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.