Realme C33: మార్కెట్ లోకి మరో రియల్ మీ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన
- By Nakshatra Published Date - 07:00 AM, Thu - 16 March 23

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది రియల్‌మీ సంస్థ. ఈ నేపథ్యంలోనే తాజాగా రియల్‌మీ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది.
రియల్‌మీ సీ 33 పేరుతో స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. మరి తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ఆ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ స్మార్ట్ ఫోన్ మనకు రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 4జీబీ-64జీబీ ఒకటి, 4జీబీ-128 జీబీ రెండోది. కాగా 4జీబీ 64 జీబీ వేరియంట్ ధర రూ.9999 కాగా, 4జీబీ128 జీబీ వేరియంట్ ధర రూ.10499గా ఉంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు 3 కలర్ లలో లభిస్తోంది. అవి ఫోన్ ఆక్వా బ్లూ, నైట్ సీ, శాండీ గోల్డ్ కలర్. ఇకపోతే ఈ రియల్‌మీ సీ33 ఫీచర్ ల విషయానికి వస్తే..
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, యూనిఎస్ఓసీ టీ612 చిప్‌సెట్ ఎంఏఐ జీ57 జీపీయూ గ్రాఫిక్ కార్డ్, 4జీబీ 64జీబీ, 4జీబీ 128జీబీ వంటి రెండు వేరియంట్ లలో లభిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ ఎస్ ఆధారితం.ఇక కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెన్సార్లు,5 ఎంపీ సెల్ఫీ కెమెరా,సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 10వాట్స్ స్టాండర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది.

Related News

Itel P40: మార్కెట్ లోకి రూ.7 వేలకే సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే?
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మార్కెట్ లోకి నిత్యం ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల అవుతూనే ఉన్నాయి.