Realme: బంపర్ ఆఫర్.. పాత మొబైల్ ఇచ్చి కేవలం రూ.999 కే ఫోన్ మీ సొంతం?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ సంస్థ ఇటీవలే మార్కెట్ లోకి రియల్మీ 10 సిరీస్ నుంచి రెండు మొబైల్స్ లాంచ్
- By Nakshatra Published Date - 07:00 AM, Wed - 18 January 23
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్మీ సంస్థ ఇటీవలే మార్కెట్ లోకి రియల్మీ 10 సిరీస్ నుంచి రెండు మొబైల్స్ లాంచ్ అయిన విషయం తెలిసిందే. అవి రియల్మీ 10 ప్రో, రియల్మీ 10 ప్రో ప్లస్. ఈ ఫోన్ లు రెండు కూడా 5జీ స్మార్ట్‌ఫోన్స్ అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఇదే సిరీస్‌లో రియల్మీ 10 4జీ మొబైల్ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,000 గా ఉంది. ఇది 4జీ మొబైల్ కాగా ఇది రెండు వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.13,999. ఇందులో అమొలెడ్ డిస్ప్లే, 50ఎంపీ ఏఐ కెమెరా సెటప్, ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్, అలాగే ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది.
కాగా రియల్మీ 10 4జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం అయింది. రష్ బ్లాక్, క్లాష్ వైట్ కలర్స్‌లో లో కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకారం మీ పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.13,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. మీ పాత మొబైల్‌కు రూ.13,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తే మీరు కేవలం ఈ స్మార్ట్ ఫోన్ ని రూ.999 చెల్లించి రియల్మీ 10 4జీ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
అలాగే ఈ ఫోన్ కి ఈఎంఐ ఆఫర్ రూ.486 నుంచి ప్రారంభం అవుతుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. రియల్మీ 10 4జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 8జీబీ వరకు అదనంగా ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 రియల్మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రియల్మీ 10 4జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే.. చూస్తే ఇందులో 50మెగాపిక్సెల్ ఏఐ ప్రైమరీసెన్సార్ 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.