Poco X7: పోకో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ ఫిక్స్.. ధర, ఫీచర్స్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో వినియోగదారుల కోసం ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతోంది. అందులో భాగంగానే త్వరలో రాబోతున్న పోకో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదిని ఫిక్స్ చేసింది.
- By Anshu Published Date - 11:03 AM, Wed - 1 January 25

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయబోతోంది. పోకో తన పోకో ఎక్స్7 ఫోన్ ప్రారంభ తేదీని ప్రకటించింది. పోకో ఎక్స్ 7, పోకో ఎక్స్ 7 ప్రాబ్లెమ్ ఈ సిరీస్ లో ఉండనున్నాయి. దీన్ని జనవరి 9, 2025 సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభించనున్నట్లు కంపెనీ ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసింది. ఈ రెండు ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని పోకో స్పష్టం చేసింది.
ఈ సిరీస్ లో మూడవ నియో వేరియంట్ కూడా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అయితే పోకో ఇండియా హెడ్ హిమాన్షు టాండన్ ఈ ఊహాగానాలకు ముగింపు పలికారు. ఇకపోతే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. పోకో ఎక్స్ 7 బేస్ మోడల్ లో మీడియాటేక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్ ఉన్నట్లు నివేదించారు. ఫోన్ గరిష్టంగా 12జీబీ రామ్ , 512జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందట. బలమైన డిస్‌ప్లే కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ఫోన్ మంచి ఆప్షన్ అని చెప్పాలి.
కాగా పోకో ఎక్స్ 7 ప్రో గురించి మాట్లాడితే.. ఇది శక్తివంతమైన మీడియాటేక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, రెండు ఫోన్ లు 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రావచ్చని తెలుస్తోంది. పోకో రెండు ఫోన్‌లు ఐపీ 68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వచ్చే అవకాశం ఉంది. దీని ధర రూ.30,000 లోపే ఉంటుందని భావిస్తున్నారు. దీనికి ముందు ప్రారంభించిన పోకో X6, X6 ప్రో ప్రారంభ ధర వరుసగా రూ. 21,999, రూ. 26,999 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.