Poco f5: భారత మార్కెట్ లోకి మరో సరికొత్త పోకో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన
- By Nakshatra Published Date - 04:26 PM, Thu - 27 April 23
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోకో సంస్థ భారత మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకువచ్చింది. మరి తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఆ పోకో సరికొత్త స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.
పోక్ ఎఫ్5 పేరుతో తీసుకొచ్చింది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ మే 9వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభంకానున్నాయి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ ఇప్పటికే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ, 12 జీబీ ర్యామ్‌తో పాటు 256 స్టోరేజ్ వేరియంట్‌తో లభించనుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ బేస్ ధర రూ. 29,000 గా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
ఇందులో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఓఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. ఫోన్ 67W చార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ సామర్ధ్యము కలిగి ఉండనుంది. కాగా కెమెరా విషయానికొస్తే ఇందులో 64ఎంపీ,8ఎంపీ, 2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఫోన్ మనకు నాలుగు కలర్ లలో లభించినట్టు తెలుస్తోంది. కాగా పోకో సంస్థ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేయగా తాజాగా కూడా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని కూడా విడుదల చేసింది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.