Oppo K12x 5G: మార్కెట్లోకి రాబోతున్న ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సంస్థ మార్కెట్ లోకి ఇప్పటికే అనేక రకాల స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త
- By Anshu Published Date - 11:00 AM, Wed - 24 July 24

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో సంస్థ మార్కెట్ లోకి ఇప్పటికే అనేక రకాల స్మార్ట్ ఫోన్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తూనే వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంది. అంతే కాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ల లలో వేరియేషన్ లను కూడా విడుదల చేస్తోంది. అలాగే ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ ధరలను ప్రకటిస్తోంది.
కాగా ఇప్పటికే మార్కెట్ లో చాలా రకాల స్మార్ట్ ఫోన్లు ఉండగా వీటితో పాటుగా ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది ఒప్పో. ఆ వివరాల్లోకి వెళితే.. ఒప్పో కే12ఎక్స్ పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ నెల 29వ తేదీన లాంచింగ్ కానుంది. కాగా ఈ ఒప్పో కే12 ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ కు రీ బ్రాండ్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.67 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్ ను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో ఈ స్క్రీన్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ ఫోన్ లో చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా వాడడానికి వీలుగా స్ప్లాష్ టచ్ టెక్నాలజీని అందించనున్నారు. అలాగే ట్వైస్ రీఆన్ ఫోర్డ్స్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారట. అలాగే ఈ ఒప్పో కే12 ఎక్స్ ఫోన్ ను బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వయోలెట్ వంటి కలర్స్ లో తీసుకొస్తున్నారు. డ్యూయల్ వ్యూ వీడియో ఫీచర్ కు సపోర్ట్ చేసే ఏఐ లింక్ బూస్ట్ టెక్నాలజీని ఇందులో అందించనున్నట్లు సమాచారం. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 45 వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు. అలాగే కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో సర్క్యులర్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తో పాటు వెర్టికల్ పిల్ షేప్డ్ మాడ్యూల్ లో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఒకేసారి ఫ్రంట్, రెయిర్ కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డ్ చేసే అవకాశం ఇందులో కల్పించారు.