Google Vs ChatGPT : ‘గూగుల్ సెర్చ్’తో ‘ఛాట్ జీపీటీ సెర్చ్’ ఢీ.. సరికొత్త ఫీచర్లు ఇవీ
‘ఛాట్‌జీపీటీ సెర్చ్’ ఆప్టిమైజ్డ్ వర్షన్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. దీన్ని స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో(Google Vs ChatGPT) వాడుకోవచ్చు.
- By Pasha Published Date - 12:28 PM, Tue - 17 December 24

Google Vs ChatGPT : ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ మార్కెట్‌లో రారాజు గూగుల్. ఇప్పుడు ‘గూగుల్ సెర్చ్’ను ఢీకొనేందుకు ఓపెన్ ఏఐ కంపెనీ ‘ఛాట్ జీపీటీ సెర్చ్’ను రంగంలోకి దించింది. ఇప్పటివరకు ఈ ఫీచర్‌ను పెయిడ్ యూజర్లకు మాత్రమే అందించారు. ఇకపై అందరికీ ఫ్రీగా ‘ఛాట్ జీపీటీ సెర్చ్’ను అందిస్తామని ఓపెన్ ఏఐ కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఇందులో అధునాతన ఫీచర్లను జోడించనున్నారని సమాచారం. వాస్తవానికి ఓపెన్ ఏఐ కంపెనీ ఈ ఏడాది నవంబరులోనే ఛాట్ జీపీటీ సెర్చింజన్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అందులో మనం ఏదైనా అడిగితే డేటాబేస్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే చూపించేది. ఇప్పుడు మనం ఏవైనా ప్రశ్నలు అడిగితే వెబ్‌లో అందుబాటులో ఉన్న సమస్త సమాచారాన్ని అందిస్తోంది. ఫాలో అప్ ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతోంది.
Also Read :Palestine Bag : పాలస్తీనా హ్యాండ్‌బ్యాగుతో ప్రియాంక.. పాకిస్తాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
‘ఛాట్‌జీపీటీ సెర్చ్’ ఆప్టిమైజ్డ్ వర్షన్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. దీన్ని స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లలో(Google Vs ChatGPT) వాడుకోవచ్చు. ఇందులో అడ్వాన్స్‌డ్ వాయిస్ సెర్చ్ మోడ్ ఫీచర్ కూడా ఉంటుంది. వాయిస్ కమాండ్ల ద్వారా ‘ఛాట్‌జీపీటీ సెర్చ్’ను మనం ప్రశ్నలు అడగొచ్చు. ఛాట్ జీపీటీలోకి లాగిన్ అయ్యే యూజర్లు ఈ సెర్చ్ ఇంజిన్ యాప్‌తో పాటు వెబ్‌సైట్‌ను కూడా ఫ్రీగా వాడుకోవచ్చు.
Also Read :TikTok Ban : టిక్‌టాక్‌కు బ్యాన్ భయం.. ట్రంప్‌తో కంపెనీ సీఈఓ భేటీ.. సుప్రీంకోర్టులో పిటిషన్
‘ఛాట్‌జీపీటీ సెర్చ్’ సరికొత్త ఫీచర్లు
- ఛాట్ జీపీటీ సెర్చ్‌లోని వాయిస్ మోడ్‌లో రియల్ టైమ్ వీడియో, స్క్రీన్ షేరింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
- బాగా టఫ్‌గా ఉండే మ్యాథ్స్ సమస్యలను కూడా ఛాట్ జీపీటీ సెర్చ్ పరిష్కరిస్తుంది.
- ఛాట్‌జీపీటీ ఛాట్ విండో దిగువన ఎడమవైపున ఉండే వీడియో ఐకాన్ ద్వారా మనం వీడియోను ప్రారంభించొచ్చు. త్రీడాట్స్ మెనూలోకి వెళ్లి స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను వాడుకోవచ్చు.
- అయితే ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఛాట్‌జీపీటీ టీమ్స్, ప్లస్, ప్రో సబ్‌స్క్రైబర్లకు మాత్రమే వీడియో ఫీచర్, స్క్రీన్ షేరింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్లు సపోర్ట్ చేస్తాయి.
- ఈ ఫీచర్లు ఛాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్, ఎడ్యు సబ్‌స్క్రైబర్లకు 2025 జనవరి నెల నుంచి అందుబాటులోకి వస్తాయి.