Palestine Bag : పాలస్తీనా హ్యాండ్‌బ్యాగుతో ప్రియాంక.. పాకిస్తాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపినందుకు ప్రియాంకకు(Palestine Bag) ఆయన ధన్యవాదాలు తెలిపారు.
- By Pasha Published Date - 11:41 AM, Tue - 17 December 24

Palestine Bag : కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ సోమవారం రోజు ‘పాలస్తీనా’ అనే పేరు రాసి ఉన్న హ్యాండ్ బ్యాగుతో పార్లమెంటులోకి వెళ్లారు. పాలస్తీనా ప్రజల పోరాటానికి సంఘీభావంగా ఆమె ఆ హ్యాండ్ బ్యాగును ధరించారు. పాలస్తీనా ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్‌పై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనా పేరుతో ఉన్న హ్యాండ్ బ్యాగును ప్రియాంక ధరించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read :TikTok Ban : టిక్‌టాక్‌కు బ్యాన్ భయం.. ట్రంప్‌తో కంపెనీ సీఈఓ భేటీ.. సుప్రీంకోర్టులో పిటిషన్
తాజాగా ప్రియాంకాగాంధీ హ్యాండ్ బ్యాగు ధరించిన ఫొటోను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేస్తూ పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపినందుకు ప్రియాంకకు(Palestine Bag) ఆయన ధన్యవాదాలు తెలిపారు. కనీసం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయనందుకు.. పాకిస్తాన్ ఎంపీలపై ఫవాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం వైపు, ధర్మం వైపు నిలబడే చొరవ చూపినందుకు ప్రియాంకకు ఆయన హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రియాంక తరహాాలో పాకిస్తాన్ ఎంపీలు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కనీస ధైర్యాన్ని ప్రదర్శించలేకపోతున్నారని ఫవాద్ మండిపడ్డారు. ‘‘జవహర్‌లాల్ నెహ్రూ వంటి మహోన్నతమైన స్వాతంత్య్ర సమరయోధుడి మనవరాలి నుంచి మనం ఇంకా ఏమి ఆశించగలం? ప్రియాంకాగాంధీ సాహసానికి హ్యాట్సాఫ్.. ఆమెకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు’’ అని ఎక్స్ పోస్ట్‌లో ఫవాద్ హుస్సేన్ ప్రస్తావించారు.
Also Read :Local Body Reservations : ‘హైడ్రా’ చట్టానికి పచ్చజెండా.. ఇక ఐదేళ్లకోసారి ‘లోకల్ బాడీ’ రిజర్వేషన్లు మార్పు
బీజేపీ వర్సెస్ ప్రియాంక
మరోవైపు మన దేశంలో బీజేపీ నేతలు ప్రియాంకాగాంధీని తప్పుపడుతున్నారు. మీడియాలో ప్రచారం కోసమే ఆమె ఈ హ్యాండ్ బ్యాగును ధరించారని విమర్శిస్తున్నారు. ‘‘ప్రియాంక బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అఘాయిత్యాలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ పాలస్తీనా హ్యాండ్ బ్యాగ్‌తో ఫ్యాషన్ స్టేట్‌మెంట్ చేయాలని అనుకుంటున్నారు’’ అని బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రియాంకాగాంధీ స్పందిస్తూ.. ‘‘బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, హిందువులు, క్రైస్తవులపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు భారత ప్రభుత్వం ఏదైనా చేయాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ దురాగతాలను ఆపాలి’’ అని కోరారు.
What else could we expect from a granddaughter of a towering freedom fighter like Jawaharlal Nehru? Priyanka Gandhi has stood tall amidst pigmies, such shame that to date, no Pakistani member of Parliament has demonstrated such courage.#ThankYou pic.twitter.com/vV3jfOXLQq
— Ch Fawad Hussain (@fawadchaudhry) December 16, 2024