HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Oneplus Is Launching Two Desktop Monitors

OnePlus: రెండు డెస్క్‌టాప్‌ మానిటర్లు లాంచ్‌ చేస్తున్న వన్‌ ప్లస్‌..

ఇండియన్‌ మార్కెట్‌లో వన్‌ ప్లస్‌ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • By Maheswara Rao Nadella Published Date - 06:00 AM, Sun - 4 December 22
  • daily-hunt
Onepluse Moniters X27, E24
Onepluse Moniters X27, E24

ఇండియన్‌ మార్కెట్‌లో వన్‌ ప్లస్‌ (OnePlus) బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రీమియం ఫీచర్లతో మిడ్‌ రేంజ్‌ ఫోన్లను రిలీజ్​ చేయడం వన్‌ ప్లస్‌ ప్రత్యేకత. అందుకే వన్‌ ప్లస్‌ బ్రాండ్​ నుంచి విడుదలయ్యే స్మార్ట్‌ ఫోన్లు (Smart Phones) హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. ఇప్పుడు ఇదే పాపులారిటీతో తన మార్కెట్‌ను మరింతగా విస్తరించే పనిలో వన్‌ ప్లస్‌ ఉంది. ఇందులో భాగంగానే డెస్క్‌టాప్‌ మానిటర్ల విభాగంలోనూ అడుగుపెడుతోంది. డిసెంబర్​ 12న కొత్తగా రెండు డెస్క్‌టాప్‌ మానిటర్లను రిలీజ్​ చేసేందుకు సిద్దమవుతోంది. వన్‌ ప్లస్‌ మానిటర్ ఎక్స్ 27, వన్‌ ప్లస్‌ మానిటర్ ఈ24 పేర్లతో ఇవి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్​ పేజీలో పెట్టిన టీజర్​లో పేర్కొంది. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లోనూ ప్రకటించింది. ఉచితంగా మానిటర్లను గెలుచుకునేందుకు ఒక లక్కీ డ్రాను కూడా కంపెనీ నిర్వహిస్తోంది.

The #OnePlusMonitors are here to change the game. Stay tuned: https://t.co/YE8W06LvdR #OnePlus #NeverSettle pic.twitter.com/Jzx6vP5H0g

— OnePlus India (@OnePlus_IN) November 30, 2022

లీకైన వన్‌ప్లస్‌​ మానిటర్ల ఫీచర్లు:

వన్‌ ప్లస్‌ ఎక్స్​27 మానిటర్​ మోడల్​ 27 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇక వన్‌ ప్లస్‌ ఎక్స్​ 24 మోడల్​ 24 ఇంచుల స్క్రీన్‌తో వస్తుంది. వీటిలో ఓ మోడల్​ పోట్రయిడ్​ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మానిటర్లలో గేమింగ్ ఎక్స్​పీరియన్స్​ అదిరిపోతుందని వన్‌ ప్లస్‌ తన టీజర్​లో పేర్కొంది. అయితే వీటి ధరలపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఎక్స్​ 27 మానిటర్​ ప్రీమియం రేంజ్​, ఈ24 మానిటర్ మిడ్‌ రేంజ్‌లో లభించనున్నాయి. దేశంలోని కొనుగోలుదారుల కోసం ఈ మోడల్‌లను రూ.20,000 లోపు విడుదల చేసే అవకాశం ఉంది.

దేశంలో క్రమంగా విస్తరిస్తోన్న వన్‌ప్లస్‌:

వన్‌ ప్లస్‌ తన ప్రోడక్ట్ పోర్ట్​ఫోలియోను క్రమంగా విస్తరిస్తోంది. ముందుగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లు మాత్రమే రిలీజ్​ చేసిన సంస్థ క్రమంగా మిడ్​ రేంజ్​ మార్కెట్‌ను ఆక్రమించింది. కేవలం రూ.25 వేల ధరలోనే ప్రీమియం ఫీచర్లు గల ఫోన్లను విక్రయిస్తోంది. దీంతో ఇండియాలో చాలా తక్కువ సమయంలోనే మోస్ట్ పాపులర్​ బ్రాండ్‌గా నిలిచింది. ఈ పాపులారిటీని కాపాడుకుంటూనే క్రమంగా వేరే ప్రొడక్ట్స్‌ను మార్కెట్​లోకి తీసుకొస్తోంది. నెక్‌ బ్యాండ్స్‌, ఇయర్‌ బడ్స్‌, ఇతర ఆడియో ప్రొడక్ట్‌లను లాంచ్​ చేస్తుంది. ఇటీవలే స్మార్ట్‌ వాచ్‌లను కూడా లాంచ్​ చేసింది. మరో వైపు స్మార్ట్‌ టీవీల మార్కెట్‌లోనూ వన్‌ ప్లస్‌ జోరు కొనసాగుతోంది. ఇండియాలో ప్రస్తుతం టాప్​ 3 స్మార్ట్​ టీవీ బ్రాండ్లలో వన్‌ ప్లస్‌ ​ ఒకటిగా ఉందని కౌంటర్​ పాయింట్​ రీసెర్చ్​ నివేదిక వెల్లడించింది.

ఇప్పుడు డెస్క్‌టాప్‌ మానిటర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టి, ఇండియా ఎలక్ట్రానిక్​ ఇండస్ట్రీలో టాప్​ ప్లేస్​ లక్ష్యంగా కృషి చేస్తోంది. రియల్​మీ, వన్‌ ప్లస్‌ కంపెనీలు ఇతర ఇండియన్‌ బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇవి తక్కువ ధరలోనే నాణ్యమైన ప్రొడక్ట్‌లను రిలీజ్​ చేస్తుండటంతో గణనీయమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీని తట్టుకునేందుకు ఇతర కంపెనీలు సైతం తమ ప్రోడక్ట్ ధరలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • desktop
  • features
  • launch
  • Monitor
  • OnePlus
  • technology

Related News

Black Friday Sale

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇక‌పై సులభంగా షాపింగ్‌!

ఈ ఫీచర్లన్నింటినీ కలిపి చూస్తే గూగుల్ జెమిని AI బ్లాక్ ఫ్రైడే సేల్‌ను గతంలో కంటే మరింత సులభంగా, తెలివిగా, సురక్షితంగా మారుస్తోంది.

  • Tata Sierra

    Tata Sierra: భార‌త మార్కెట్‌లోకి తిరిగి వ‌చ్చిన‌ టాటా సియెర్రా.. బుకింగ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

Latest News

  • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

  • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

  • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

  • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

  • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

Trending News

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd