OnePlus Offer: వన్ ప్లస్ ఫోన్ పై భారీ తగ్గింపు.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం
- By Anshu Published Date - 07:30 AM, Thu - 16 February 23

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లో విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై డిస్కౌంట్ ని ప్రకటిస్తోంది. అందులో భాగంగానే వన్‌ప్లస్ 10 ప్రో 5జీ మొబైల్ ధర తగ్గించింది. మరి ఈ ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల విషయానికొస్తే.. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ధరలు చూస్తే 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999గా ఉంది. అలాగే 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.71,999 గా ఉంది. అయితే ఈ మొబైల్‌పై రూ.6,000 ధర తగ్గించింది వన్‌ప్లస్ సంస్థ.
దాంతో పాటు 8జీబీ128జీబీ వేరియంట్ రూ.60,999 ధరకు, 8జీబీ 28జీబీ వేరియంట్ రూ.65,999 ధరకు దిగొచ్చింది. అయితే ఈ వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనేవారికి పలు ఆఫర్స్ ఉన్నాయి. పలు బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్‌తో కొంటే భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసే వారికి రూ.25,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లభిస్తోంది. కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కలిపి మొత్తం రూ.31,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అలా మొత్తం ఆఫర్స్ కలిపి వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ 128జీబీ వేరియంట్‌ను రూ.35,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐ ఆఫర్స్ కూడా ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ రూ.5,000 నుంచి ప్రారంభం అవుతుంది.
వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విషయానికి వస్తే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 48మెగాపిక్సెల్ సోనీ IMX789 ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL JN1 సెన్సార్ 8 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ Sony IMX615 కెమెరా ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్, 50 వాట్ వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది.