Nokia G42 5G: రూ.10 వేలకే నోకియా 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుక
- By Nakshatra Published Date - 07:39 PM, Mon - 4 March 24
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన నోకియా సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడం కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది.. అందులో భాగంగానే తాజాగా నోకియా జీ42 5జీ ఫోన్లో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. 4జీబీ ర్యామ్ ఆప్షన్‌తో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999కాగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ మనకు సో గ్రే, సో పింక్, సో పర్పుల్ రంగుల్లో లభించనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. నోకియా జీ42 5జీ స్మార్ట్ ఫోన్ల 6.56 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. 720×1612 పిక్సెల్స్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. 560 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది.
ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్ సెట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కాగా కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.