Nokia C22: కేవలం రూ.8 వేలకే నోకియా స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్?
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా సంస్థ ఇప్పటికీ మార్కెట్లోకి ఎన్నో అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసింద
- By Nakshatra Published Date - 06:10 PM, Fri - 12 May 23
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా సంస్థ ఇప్పటికీ మార్కెట్లోకి ఎన్నో అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా నోకియా సంస్థ అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన మరో స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా సీ22 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. మరి ఆ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ ల విషయానికొస్తే..
నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. యూనిసోక్ ఎస్సీ9863A ప్రాసెసర్‌తో పనిచేస్తే ఈ ఫోన్లో 4జీబీ వరకు ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సపోర్ట్‌ని అందించారు. రెండేళ్ల పాటు క్వార్టర్లీ సెక్యూరిటీ అప్డేట్ను అందిస్తారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్లో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. కెమెరాలో పోర్ట్రైట్, హెచ్డీఆర్, నైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.7,999గా ఉంది. 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ కి సంబందించిన ప్రీ బుకింగ్ ప్రారంభం అయ్యింది. ఇక బజాజ్ ఫిన్సర్వ్ నుంచి కేవలం రూ.1334 ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. జియో నుంచి రూ.3,500 విలువైన బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.
Related News
Smart phone : స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
Indian Computer: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని లోపాల (ఫ్లాస్) కారణంగా మీ ఫోన్ హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు చాలా సులభంగా మీఫోన్ ను తమ కంట్రోల్ లోకి తీసుకోవచ్చని, ఫోన్ లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని �