pTron Smartwatch: కేవలం రూ.2 వేలకే స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో స్మార్ట్ వాచ్, స్మార
- By Nakshatra Published Date - 08:00 PM, Tue - 11 July 23
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్, ఇయర్ బర్డ్స్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగదారుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అందుకు అనుగుణంగా ఆయా కంపెనీలు కూడా కొత్త కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్ ల వినియోగం కూడా బాగా పెరిగింది. అందరూ తమ చేతికి స్మార్ట్ వాచ్ ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా స్మార్ట్ వాచ్ ని కొనుగోలు చేయాలి అనుకుంటే వెంటనే ఇది తెలుసుకోండి.
ప్రీమియం మోడల్లో పీట్రాన్ ఏస్ స్మార్ట్ వాచ్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. దీంతో పాటు జెన్ బడ్స్ ఈవో ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ రెండు కూడా ప్రీమియం ఫీచర్లతో పాటు అనువైన ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్ వాచ్ లో 1.85 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ప్రత్యేకంగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఇది ఇన్ డోర్, అవుట్ డోర్ లలోనూ అద్భుతమైన డిస్ ప్లే ను అందిస్తుంది. మంచి క్వాలిటీతో కూడిన పిక్చర్ ను కూడా అందిస్తుంది. ఐపీ68 రేటింగ్ తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్ గా పనిచేస్తుంది. ఇకపోతే ఫీచర్ల విషయానికి వస్తే.. హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి.
ప్రతి రోజూ చేసే వ్యయామాలు, వాకింగ్ వంటి పర్యవేక్షణ ఉంటుంది. ఇందులో 120 స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వారికి సరిగ్గా సరిపోతుంది. అలాగే ఇన్ బిల్ట్ గేమ్స్ ఈ స్మార్ట వాచ్ లో ఉంటాయి. ఈ ఇయర్ బడ్స్ స్టైలిష్ లుక్ లో ఉంటాయి. దీనిలో ట్రూ టాక్ ఏఐ ఈఎన్సీ కాల్స్ టెక్నాలజీని వినియోగించారు. ఇది బ్యాగ్రౌండ్ నాయిస్ ను సమర్థవంతంగా తగ్గిస్తోంది. 32 గంటల ప్లే టైం ఉంటుంది. ఇందులో మూవీ లేదా మ్యూజిక్ మోడ్లు ఉంటాయి. దీనిలో ఎలక్ట్రో ప్లేటెడ్ టైప్ సీ ఫాస్ట్ చార్జింగ్ కేస్ ఉంటుంది. ఇది కూడా ఐపీఎక్స్5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెన్స్ గా వస్తోంది. కాగా ఈ పీట్రాన్ ఏస్ స్మార్ట్ వాచ్ జూలై 10 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ. 1299గా ఉంది. అలాగే పీట్రాన్ ఇయర్ బడ్స్ ధర రూ. 899గా ఉంది. ఇది జూలై 11 నుంచి అనగా నేడు ఆన్ లైన్లో అందుబాటులోకి వచ్చింది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.