Samsung Galaxy M14 5G: మార్కెట్ లోకి మరో కొత్త శాంసంగ్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రస్తుతం మార్కెట్లో 5జీట్రెండ్ మొదలవ్వడంతో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ కంపెనీలో 5జి వేరియంట్లలో మొబైల్
- By Nakshatra Published Date - 07:30 AM, Sat - 11 March 23

ప్రస్తుతం మార్కెట్లో 5జీట్రెండ్ మొదలవ్వడంతో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ కంపెనీలో 5జి వేరియంట్లలో మొబైల్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో 5 జి మొబైల్ మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. కాగా తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం అయిన శాంసంగ్, తమ సరికొత్త శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ స్మార్ట్ ఫోన్ ను ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. త్వరలోనే భారతీయ మార్కెట్లోకి కూడా ఈ ఫోన్ తీసుకురానుంది. మరి శాంసంగ్ సంస్థ తీసుకువచ్చిన ఈ కొత్త మొబైల్ ధర ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ మొబైల్ మనకు మూడు కలర్లలో అందుబాటులో ఉండనుంది. అవి బ్లూ, డార్క్ బ్లూ, సిల్వర్ కలర్ లలో లభించనుంది. కాగా 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లలో ఈ ఫోన్ లభించనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను 8,299 యువాన్లుగా అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 18,300 గా ఉంది. అలాగే 4 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను 8,999 యువాన్లుగా అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 19,900 గా ఉంది.
ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లో ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. అలాగే 1080 పిక్సల్ స్క్రీన్ ఇన్ఫినిటీ-యూ నాచ్, ఎక్సినోస్ 1330 చిప్ సెట్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ అందుబాటులో ఉండనుంది. వెనుక వైపు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, అలాగే 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది. ముందు వైపు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 6000 ఎంఏహెచ్ సామర్థ్యం తో లభించనుంది..

Related News

WhatsApp: వాట్సాప్ డెస్క్ టాప్ లో సరికొత్త ఫీచర్స్.. అవేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే!
ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది