Moto G14: మరో రెండు కొత్త కలర్స్ తో ఆకట్టుకుంటున్న మోటో జీ14.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన మోటోరోలా
- By Nakshatra Published Date - 07:26 PM, Thu - 24 August 23
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన మోటోరోలా సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. అలాగే తక్కువ ధరలో మంచి ఫీచర్ లతో కూడిన ఫోన్లను తీసుకొస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లలో కొత్త కొత్త ఫీచర్ లను పరిచయం చేస్తోంది. అలాగే ఆ ఫోన్ లపై భారీగా తగ్గింపు ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే మోటోరోలా సంస్థ గతంలో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లో మరో రెండు సరికొత్త కలర్స్ ని ప్రవేశపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..
మోటోరోలా కంపెనీ ఈ నెల ప్రారంభంలో మోటో జీ 14 స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. స్టీల్ గ్రే, స్కై బ్లూ ఆప్షన్స్‌లో ఈ ఫోన్ ని తీసుకొచ్చింది. అయితే తాజాగా బటర్ క్రీమ్, పాలెలిలాక్ కలర్స్‌లో తీసుకువచ్చింది. ఆగస్టు 24వ తేదీ నుంచి ఈ కొత్త ఫోన్స్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. మోటోరోలా జీ14 ఫోన్ 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999 గా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. కాగా ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్లో 20 వాట్స్ టర్బో పవర్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా అందించారు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్లో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ + డిస్ప్లేను ఇచ్చారు.
1080×2400 పిక్సెల్స్ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 405 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఈ స్క్రీన్ ప్రత్యేకత. ఇక ఈ ఫోన్ అక్టాకోర్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్సెట్తో రన్ చేస్తుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వంటి స్పెషల్ ఫీచర్స్‌ను ఇచ్చారు. సెల్ఫీల కోసం 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.