HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Millions Leave Musks X After Trump Win Shift To Jack Dorseys Bluesky

X Vs Bluesky : లక్షలాది ‘ఎక్స్‌’ యూజర్లు జంప్.. ‘బ్లూ స్కై’కు క్యూ.. కారణమిదీ

గత కొన్ని రోజులుగా బ్లూ స్కైలో(X Vs Bluesky) ప్రతిరోజు సగటున దాదాపు 10 లక్షల మంది కొత్త యూజర్లు చేరుతున్నారట.

  • Author : Pasha Date : 16-11-2024 - 12:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
X Vs Bluesky Elon Musk Jack Dorsey Trump

X Vs Bluesky : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా కంపెనీ ‘ఎక్స్’‌కు షాక్ తగిలింది. లక్షలాది మంది యూజర్లు ఎక్స్ నుంచి వైదొలగడం ప్రారంభించారు. ట్రంప్ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్‌కు కీలక పదవి దక్కనుండటం వల్లే యూజర్లు ఎక్స్‌కు గుడ్ బై చెబుతున్నారని తెలుస్తోంది. వచ్చే నాలుగేళ్ల పాటు ఎక్స్‌లో ట్రంప్‌కు భజన చేసే అంశాలే ఎక్కువగా ట్రెండ్ అయ్యేలా ఎలాన్ మస్క్ చేస్తారనే అభిప్రాయానికి ఎక్స్ యూజర్లు వచ్చారు. అందుకే వాళ్లు ప్రత్యామ్నాయం కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈక్రమంలో ఎక్స్‌ను వదిలేసిన చాలామంది ‘బ్లూ స్కై’ వైపు వెళ్లిపోతున్నారు. బ్లూ స్కై సోషల్ మీడియా యాప్ చూడటానికి అచ్చం ఎక్స్‌లాగే ఉంటుంది. దాని రంగు, లోగో సైతం ట్విట్టర్‌ను తలపిస్తాయి.  గత కొన్ని రోజులుగా బ్లూ స్కైలో(X Vs Bluesky) ప్రతిరోజు సగటున దాదాపు 10 లక్షల మంది కొత్త యూజర్లు చేరుతున్నారట. ప్రస్తుతం మొత్తం 1.67 కోట్ల మంది యూజర్లు బ్లూ స్కైకు ఉన్నారు. ఈ పరిణామం ఎక్స్‌కు హడలు పుట్టిస్తోంది.

Also Read :Indian Artefacts : అమెరికా టు భారత్.. స్వదేశానికి 1,400 ప్రాచీన కళా ఖండాలు

ఏమిటీ బ్లూస్కై ?

  • ట్విట్టర్ కంపెనీ మాజీ అధిపతి జాక్ డార్సీ.. బ్లూ స్కై సోషల్ మీడియా కంపెనీని ప్రారంభించారు. అయితే 2024 మే నెలలో ఆయన బ్లూ స్కై కంపెనీ బోర్డు నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఈ కంపెనీకి సీఈఓగా జే గ్రాబెర్ వ్యవహరిస్తున్నారు.
  • అచ్చం ట్విట్టర్ తరహా ఇంటర్ ఫేస్ ఉండటం బ్లూ స్కై ప్రత్యేకత.
  • బ్లూ స్కై యూజర్లు తాము సొంతంగా వ్యక్తిగత డొమైన్లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రత్యేక ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
  • ఇటీవలే బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత మీడియా దిగ్గజం ‘ది గార్డియన్’ కూడా ఎక్స్ నుంచి వైదొలగింది. ఇకపై దాన్ని వినియోగించబోమని స్పష్టం చేసింది.
  • ఈ పరిణామాలు బ్లూ స్కైకు ప్లస్ పాయింట్లు మారే అవకాశాలు ఉన్నాయి.
  • లిజో, బెన్ స్టిల్లర్ జేమీ లీ కుర్టిస్, పాటాన్ ఓస్వాల్ట్ వంటి హాలీవుడ్ సెలిబ్రిటీలు ఇప్పటికే బ్లూ స్కైలో చేరారు.

Also Read :Rivers Inter Linking : గోదావరి – కృష్ణా – పెన్నా నదుల అనుసంధానం.. ఏపీకి ప్రయోజనమిదీ

  • బ్లూస్కై కంపెనీ ఏర్పాటు చేసిన కొత్తలో ఇన్వెస్టర్ల నుంచి, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి నిధులను సేకరించారు.
  • ఇప్పుడు యూజర్లకు కస్టమ్ డొమైన్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అంటే యూజర్లు బ్లూ స్కైలో వారి వ్యక్తిగత పేర్లతో పేజీలను క్రియేట్ చేసుకోవచ్చు.
  • అయినప్పటికీ ఎక్స్‌ కంపెనీకి బ్లూ స్కై చాలా దూరంలో ఉంది. ప్రస్తుతం ఎక్స్‌లో రోజువారీగా దాదాపు 25 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉంటారు.

Also Read :Old Vehicles : కాలం చెల్లిన వాహనాలు @ 42 లక్షలు.. వీటిలో టూవీలర్స్ 31 లక్షలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bluesky
  • elon musk
  • jack dorsey
  • Trump
  • X
  • X Vs Bluesky

Related News

Iran-US War

మిడిల్ ఈస్ట్ యుద్ధం.. ఇరాన్‌పై పెరుగుతున్న‌ ఒత్తిడి?!

యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్, ఇరాన్ నాయకత్వ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు మరణించారు.

  • Iran Saval To America

    Iran-US War : అమెరికా కు మరోసారి ఇరాన్ సవాల్

Latest News

  • Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

  • చెప్పులు వాడుతున్నారా? అయితే ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే!

  • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

  • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

  • ఐపీఎల్‌లో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ మృతి!

Trending News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd