HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Technology
  • ⁄Meta To Fire 10000 Employees In Second Round Of Job Cuts

Meta Layoffs: మెటాలో మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు.. 10,000 మంది ఉద్యోగులు ఔట్..!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta) రెండవసారి భారీ తొలగింపులకు సన్నాహాలు చేసింది. ఈసారి 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది.

  • By Gopichand Published Date - 07:44 AM, Wed - 15 March 23
Meta Layoffs: మెటాలో మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు.. 10,000 మంది ఉద్యోగులు ఔట్..!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta) రెండవసారి భారీ తొలగింపులకు సన్నాహాలు చేసింది. ఈసారి 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది. Meta మంగళవారం నాడు తన బృందం నుండి సుమారు 10,000 మంది సిబ్బందిని తొలగించవచ్చని, సుమారు 5,000 అదనపు ఓపెన్ పొజిషన్‌లను మూసివేయాలని కూడా భావిస్తోంది. నాలుగు నెలల క్రితం సుమారు 11 వేల మంది ఉద్యోగులకు కంపెనీ తొలగించిన విషయం తెలిసిందే.

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీలో భారీ తొలగింపులపై సూచన చేశారు. “మా బృందంలో సుమారు 10,000 మంది ఉద్యోగులను తగ్గించాలని, సుమారు 5,000 అదనపు ఓపెన్ పొజిషన్లను మూసివేయాలని మేము భావిస్తున్నాము” అని జుకర్‌బర్గ్ ఉద్యోగులకు ఒక సందేశంలో తెలిపారు. నిజానికి, మెటా ఫ్యూచరిస్టిక్ మెటావర్స్‌ను అభివృద్ధి చేయడానికి బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెడుతోంది. కాబట్టి కంపెనీ అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లను ఎదుర్కొంటుంది. అలాగే, కంపెనీ పోస్ట్-పాండమిక్ మాంద్యంతో కూడా పోరాడుతోంది.

Also Read: Whatsapp: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే అనుమతి తప్పనిసరి?

దీనికి ముందు కూడా, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా గత ఏడాది నవంబర్‌లో దాదాపు 11,000 మందిని తొలగించింది. కంపెనీ చరిత్రలో ఇది అతిపెద్ద తొలగింపు. సెప్టెంబర్ చివరి నాటికి మెటాలో మొత్తం 87 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని కంపెనీ చెప్పింది. దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ వలన కార్పొరేట్ అమెరికాలో భారీ ఉద్యోగాల కోతకు దారి తీసింది. గోల్డ్‌మన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి వాల్ స్ట్రీట్ బ్యాంకుల నుండి అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సాంకేతిక సంస్థల వరకు ఉద్యోగుల కోత చేపట్టాయి.

లేఆఫ్ ట్రాకింగ్ సైట్ ప్రకారం.. టెక్ ప్రపంచం 2022 ప్రారంభం నుండి 280,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో ఈ ఏడాది దాదాపు 40 శాతం జరిగాయి. గతంలో మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా, గూగుల్ 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ కూడా 18,000 ఉద్యోగాలను తొలగించింది. నివేదిక ప్రకారం.. 2022లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ 60 శాతానికి పైగా ఉద్యోగులను తొలగించింది.

Telegram Channel

Tags  

  • Facebook
  • Mark Zuckerberg
  • meta
  • meta layoffs
  • tech news
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Re-Entered to Facebook: ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్!

Re-Entered to Facebook: ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్!

రెండేళ్ల తరువాత మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘నేను మళ్లీ వచ్చేశా’’ అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం..

  • ChatGPT: మనదేశంలోనూ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్.. ధర, ఎక్స్ ట్రా ఫీచర్స్ ఇవీ..!

    ChatGPT: మనదేశంలోనూ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్.. ధర, ఎక్స్ ట్రా ఫీచర్స్ ఇవీ..!

  • Meta Lay Off : మ‌రోసారి భారీగా ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లికిన మెటా.. ఈ సారి..?

    Meta Lay Off : మ‌రోసారి భారీగా ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లికిన మెటా.. ఈ సారి..?

  • Elon Musk: స్నైల్‌ బ్రూక్: మస్క్ సొంతంగా నిర్మించనున్న మహా నగరం విశేషాలు..!

    Elon Musk: స్నైల్‌ బ్రూక్: మస్క్ సొంతంగా నిర్మించనున్న మహా నగరం విశేషాలు..!

  • Instagram Down: ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. సేవలకు అంతరాయం

    Instagram Down: ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. సేవలకు అంతరాయం

Latest News

  • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

  • JIO 5G: ఏపీలో ఆ 9 పట్టణాలలో జియో 5జీ సేవలు.. అవేవంటే?

  • WPL 2023: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌ విజయవంతం అవుతుందా?

  • Biryani Vending Machine: దేశంలోనే ఫస్ట్ బిర్యానీ వెండింగ్ మెషీన్‌.. చెన్నై స్టార్టప్ సెన్సేషన్..

  • 19 Sheeps Killed: రెచ్చిపోయిన వీధి కుక్కలు.. 19 గొర్రెలు మృతి

Trending

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

    • RRR: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. అబ్బో మాములుగా చేయలేదుగా?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: