Mahindra: మహీంద్రా ఎస్యూవి కార్ సరికొత్త రికార్డు.. తక్కువ డిగ్రీ సెల్సియస్ లో కూడా?
చాలామంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ చల్లని వాతావరణంలో ఎఫెక్ట్ అవుతాయని, అలాగే బ్యాటరీ
- By Nakshatra Published Date - 07:30 AM, Tue - 10 January 23
చాలామంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ చల్లని వాతావరణంలో ఎఫెక్ట్ అవుతాయని, అలాగే బ్యాటరీ మైలేజ్ కూడా తగ్గుతుందని అనుకుంటూ ఉంటారు. అయితే అవన్నీ ఒట్టి అపోహలే అని తాజాగా దేశీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ మహీంద్రా నిరూపించింది. కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవి మైనస్ జీరో ఉష్ణోగ్రతలలో కొత్త రికార్డును సృష్టించింది. ఆ వివరాల విషయానికి వస్తే.. తాజాగా మహేంద్ర సంస్థ అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ..
ఎక్స్యూవి400 మైనస్ జీరో కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా ప్రయాణించి రికార్డు సృష్టించిందని కంపెనీ తెలిపింది. చలి పర్వత ప్రదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు మనుగడ సాగించడం కష్టమని కంపెనీ పోస్ట్‌లో పేర్కొంది. కానీ దానిని మహీంద్రాతో మేము అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనుకున్నాము.
ఈ ఆల్ ఎలక్ట్రిక్ ఎక్స్యూవి400 ఒక రోజులో మైనస్ సున్నా ఉష్ణోగ్రతలలో గరిష్ట దూరానికి ప్రయాణించి రికార్డు సృష్టించింది అని వెల్లడించింది మహేంద్ర సంస్థ. కాగా ఈ ఎస్‌యూవిని హిమాచల్ ప్రదేశ్‌లోని కీలాంగ్, లాహౌల్ స్పితి వంటి అత్యంత చల్లటి ప్రదేశాలలో డ్రైవ్ చేశారు. ఈ సమయంలో ఈ ఎక్స్యూవి ఎటువంటి సమస్యలు లేకుండా 24 గంటల్లో దాదాపుగా 751 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. అలాగే ఈ ఎక్స్యూవి మంచు రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణించింది. ఇకపోతే ఈ మహీంద్రా ఎక్స్యూవి400 ఫీచర్లు విషయానికి వస్తే..ఈ ఎస్యూవి టాప్-స్పెక్ ట్రిమ్ బ్రాండ్ అడ్రినో X సాఫ్ట్‌వేర్‌తో ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్, ఓవర్ దిఎయిర్ అప్డేట్లతో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి ఎన్నో ఫీచర్లను పొందుతుంది.
అదేవిధంగా భద్రత పరంగా, ఈ ఎలక్ట్రిక్ ఎక్స్యూవికి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్ రౌండ్ డిస్క్ బ్రేక్‌లు, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు మరికొన్ని సేఫ్టీ టెక్నాలజి లభిస్తాయి. ఈ ఎస్యూవి లాంచ్ సమయంలో అన్నీ ట్రిమ్‌ల ఫీచర్లపై మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎక్స్యూవి400 ఎలక్ట్రిక్ ఎక్స్యూవిలోని PSM ఎలక్ట్రిక్ మోటార్ 147 హార్స్పవర్, 310 న్యూటన్ మీటర్ల టార్క్‌ను జెనరేట్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 150 kmph ఇంకా కేవలం 8.3 సెకన్లలో సున్నా నుండి 100 kmph స్పీడ్ అందుకుంటుంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. ఈ SUV బ్యాటరీ గురించి చెప్పాలంటే, ఇందులో ఇచ్చిన బ్యాటరీ సామర్థ్యం 39.4 kWh ఇంకా బ్యాటరీ ప్యాక్ IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ పొందింది. ఈ బ్యాటరీతో ఫుల్ ఛార్జ్‌లో దాదాపు 456 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
Related News
Discount offer on Cars: ఫిబ్రవరిలో ఈ కార్లపై భారీగా డిస్కౌంట్.. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే?
ఈ ఏడాది మొదలైన తర్వాత చాలా వరకు కార్ల తయారీ సంస్థలు వాటి కార్లపై ధరలను విపరీతంగా పెంచేసిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది డిసెంబర్లో కార్ల