HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Lava Blaze Nxt Launched In India Check Price Specs And Features

Lava Blaze NXT: భారత్ లో లావా బ్లేజ్ NXT స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్లు ఇవే?

ఇండియన్ టెక్ కంపెనీ లావా ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేసిన

  • Author : Anshu Date : 26-11-2022 - 5:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lava Blaze Nxt
Lava Blaze Nxt

ఇండియన్ టెక్ కంపెనీ లావా ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ ఫోన్ మార్కెట్ లో పాపులర్ బ్యాండ్లలో లావా కూడా ఒకటిగా నిలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా లావా ఇండియాలో లావా బ్లేజ్ NXT అనే మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి ఇది 4జీబీ 64జీబీ సింగిల్ కాన్ఫిగరేషన్‌లోనే లభించనుంది. స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ 37 SoC చిప్‌సెట్‌తో పనిచేయనుంది. లావా బ్లేజ్ మార్క్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో వచ్చిన ఈ ఫోన్, ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో క్లాసీగా చూడడానికి అద్భుతమైన లుక్ లో కనిపిస్తోంది.

ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చిన లావా బ్లేజ్ మోడల్‌ కు సక్సెసర్‌గా కంపెనీ కొత్త ఫోన్‌ ను రూపొందించింది. ఇకపోతే విడుదల చేసిన లావా బ్లేజ్ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ధర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లావా బ్లేజ్ NXT ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్డీ + IPS డిస్‌ప్లేతో లభించనుంది. అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. బయోమెట్రిక్స్ కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా లావా అందించింది.

అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇకపోతే కెమెరా విషయానికి వస్తే.. లావా బ్లేజ్ NXT ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీంట్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు రెండు సెకండరీ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ 30 fps వద్ద 1080పి ఫుల్ హెచ్డీ వీడియోలను రికార్డ్ . ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కంపెనీ అందించింది. కాగా ఈ లావా బ్లేజ్ NXT ఫోన్‌ ధర ధర విషయానికి వస్తే.. స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,299గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లూ, రెడ్ రెండు కలర్ ఆప్షన్లలో లభించనుంది. కంపెనీ ఈ కొత్త మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • features
  • india
  • lava
  • Lava Blaze NXT
  • price
  • Smart Phone

Related News

    Latest News

    • Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd