Komaki Flora: మార్కెట్ లోకి కొమాక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన కొమాక్ తాజాగా భారత మార్కెట్ లోకి కొమాకి ఫ్లోరా స్కూటర్
- By Nakshatra Published Date - 07:30 AM, Wed - 7 December 22
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన కొమాక్ తాజాగా భారత మార్కెట్ లోకి కొమాకి ఫ్లోరా స్కూటర్ విడుదల చేసింది. విడుదల చేసిన ఈ స్కూటర్ బడ్జెట్ ధరతోనే మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మారింది. ఈ స్కూటర్ కొత్త బ్యాటరీ తో పని చేయనుంది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర విషయానికి వస్తే.. ఎక్స్ షోరూమ్ ధర రూ.78,999 గా ఉంది. ఈ స్కూటర్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 8వ ఎడిషన్ అని కంపెనీ తెలిపింది కొమాక్ సంస్థ. కాగా ఇందులో అల్ట్రా మోడ్రన్ హీట్ ప్రూఫ్ లిథియం అయాన్ ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీని ఉపయోగించారు.
ఈ స్కూటర్ వాహనదారుడు స్కూటర్ నుండి బ్యాటరీ ప్యాక్‌ను సులభంగా తీసి మళ్లీ అటాచ్ చేయవచ్చు. LPF బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించడం ద్వారా స్కూటర్ భద్రతను పెంచినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొమాక్ స్కూటర్ రేంజ్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వస్తే.. ఈ కొమాక్ స్కూటర్ 100 కి.మీ వరకు ఫుల్ ఛార్జ్ తో వస్తుంది. క్రూయిజ్ మోడ్‌లో 80 కి.మీ పరిధిని అందిస్తుంది. కాగా ఈ స్కూటర్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. 100 కిలోమీటర్లు నడపడానికి బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి దాదాపు 2 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. విద్యుత్తు రేటు యూనిట్‌కు రూ. 5గా చూస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 10 ఖర్చుతో 100 కి.మీ ప్రయాణిస్తుంది.
అలాగే ఈ స్కూటర్ ఫీచర్స్ అండ్ కలర్స్ విషయానికి వస్తే.. కొత్త మోడల్లోని ముఖ్య ఫీచర్లు చూస్తే సెల్ఫ్ డయాగ్నస్టిక్ మీటర్, అదనపు బ్యాక్‌రెస్ట్‌తో సౌకర్యవంతమైన సీటు లాంటి ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. అలాగే వీటితో పాటు పార్కింగ్ అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, బూట్ స్పేస్, అదనపు సెక్యూరిటి కోసం 270x35mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ను ఇచ్చారు. కొమాక్ ఫ్లోరా స్కూటర్ మనకు జెట్ బ్లాక్, గార్నెట్ రెడ్, స్టీల్ గ్రే, శాక్రమెంటో గ్రీన్ ఇలా నాలుగు కలర్ లలో లభించనుంది. కాగా కొమాక్ కంపెనీ ఒక ప్రకటనలో ఐరన్-రిచ్ సెల్స్ అండ్ హై ఫైర్ రిసిస్టంట్ కారణంగా, LiFePO4 బ్యాటరీలు క్లిష్ట పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ఉంటాయి.
Related News
Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాలకు కలిసిరాని ఏప్రిల్..! భారీగా తగ్గిన విక్రయాలు..!
ఈ ఏడాది మార్చి నెలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలకు మంచి సమయం లభించింది.