Jio Air Fiber: వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన జియో ఫైబర్.. తేడాలు ఇవే?
నేడు వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి రిలయన్స్ జియో టెలికాం కంపెనీ జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించబోతోంది. ఇదే విషయాన్ని
- By Nakshatra Published Date - 07:00 PM, Mon - 18 September 23
నేడు వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి రిలయన్స్ జియో టెలికాం కంపెనీ జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించబోతోంది. ఇదే విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ 2023 ఏజీఎమ్ సందర్భంగా ప్రకటించారు. ఇది గృహాలు, కార్యాలయాల కోసం రూపొందించబడిన పోర్టబుల్ వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌గా అంబానీ తెలిపారు. కాగా ఈ జియో ఎయిర్ ఫైబర్ గరిష్టంగా 1.5 Gbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని కలిగి ఉంటుంది. దీంతో వినియోగదారులకు సజావుగా, వేగంగా అధిక ఇంటర్నెట్ను ప్రసారం చేయడానికి వీలు కల్పిస్తుంది. వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆన్లైన్ గేమ్స్ వంటి వాటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాల్గొనవచ్చు.
జియో ఎయిర్ ఫైబర్ పిల్లలపై తల్లిదండ్రుల నియంత్రణలు, Wi-Fi 6కి మద్దతిస్తుంది. ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంది. జియో ఎయిర్‌ఫైబర్ సేవలను మొదటగా గత సంవత్సరం కంపెనీ 45వ AGMలో ప్రవేశపెట్టారు. ఇకపోతే ఈ జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏమిటి? అన్న విషయానికి వస్తే.. జియో ఎయిర్ ఫైబర్ అనేది జియో నుంచి వచ్చిన కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5జీ సాంకేతికతను ఉపయోగిస్తుంది. అలాగే సాంప్రదాయ ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లతో పోల్చదగిన వేగాన్ని అందిస్తుంది. వినియోగదారులు గరిష్టంగా 1 Gbps వేగంతో డేటాను పొందవచ్చు. జియో ఎయిర్ ఫైబర్ కాంపాక్ట్ మాత్రమే కాకుండా సెటప్ చేయడం కూడా సులభం అని కంపెనీ వెల్లడించింది. వినియోగదారులు దీన్ని ప్లగ్ ఇన్ చేసి, ఆన్ చేస్తే సులభంగా వైఫై సహాయంతో ఈ సేవలను పొందవచ్చు. కాగా జియో ఫైబర్ vs జియో ఎయిర్ ఫైబర్ మధ్య తేడాల విషయానికి వస్తే.. జియో ఫైబర్ దాని కవరేజ్ కోసం వైర్డు ఫైబర్ ఆప్టిక్ కేబుల్లను ఉపయోగిస్తుంది.
అయితే Jio AirFiber పాయింట్-టు-పాయింట్ రేడియో లింక్‌లను ఉపయోగించి వైర్లెస్ విధానాన్ని తీసుకుంటుంది. అంటే జియో ఎయిర్‌ఫైబర్ గృహాలు, కార్యాలయాలను నేరుగా జియోకు వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా అనుసంధానిస్తుంది. దీంతో ఫైబర్ కేబుల్స్ పరిమితుల నుంచి విముక్తి పొందుతుంది. బదులుగా ఇది జియో టవర్లతో లైన్-ఆఫ్-సైట్ కమ్యూనికేషన్‌పై ఆధారపడుతుంది. అలాగే జియో ఎయిర్ ఫైబర్ గరిష్టంగా 1.5 Gbps ఇంటర్నెట్ వేగాన్ని కల్గి ఉంటుంది. జియో ఫైబర్ 1 Gbps వేగాన్ని మాత్రమే కల్గి ఉంటుంది. దీంతో జియో ఫైబర్ కంటే జియో ఎయిర్ ఫైబర్ ఎక్కువ వేగాన్ని కల్గి ఉంటుంది. అయితే జియో ఎయిర్‌ఫైబర్ వాస్తవ వేగం సమీప టవర్‌కు ఉండే సామీప్యతను బట్టి మారవచ్చు. అదేవిధంగా జియో ఫైబర్ విస్తృత కవరేజీని అందిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా అందుబాటులో లేదు. కానీ JioAirFiber వైర్లెస్ సాంకేతికత భౌతిక మౌలిక సదుపాయాల ద్వారా పరిమితం కాకుండా విస్తృతమైన కవరేజీని అందించడానికి అనుమతిస్తుంది. ఇన్స్టాలేషన్… ప్లగ్-అండ్-ప్లే చేయడానికి రూపొందించారు. దీంతో ఇది మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. అయితే జియో ఫైబర్‌కు మాత్రం సాధారణంగా ప్రొఫెషనల్ ఇన్స్టాలేషన్ అవసరం.
Related News
Jio AirFiber: జియో సంచలనం: ఎయిర్‌ఫైబర్ వచ్చేసింది
టెలికాం రంగంలో రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. అందులో భాగంగా ఈ రోజు సెప్టెంబర్ 19న వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించింది.