iQoo Neo 7 Pro: మార్కెట్ లోకి అద్భుతమైన ఐకూ నియో స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐకూ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు మార్కెట్ల
- By Nakshatra Published Date - 07:00 PM, Tue - 4 July 23
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐకూ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఐకూ 7 సిరీస్‌లో ఐకూనియో 7 ప్రో 5జీ మొబైల్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఐకూ నియో 7 ప్రో 5జీ రెండు వేరియంట్ లలో లభిస్తోంది. ఇందులో అమొలెడ్ డిస్ప్లే 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.34,999 కాగా అమెజాన్ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ.31,999 ధరకే ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. ఎర్లీ బర్డ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఐకూ నియో 7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయ్యింది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999 కాగా, 12జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999 గా ఉంది..అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కొనొచ్చు. జూలై 15న సేల్ ప్రారంభం అవుతుంది. రూ.1,000 చెల్లించి ప్రీ-బుక్ చేయొచ్చు. ప్రీ-బుక్ చేసేవారికి రెండేళ్ల వారెంటీ లభిస్తుంది. కాగా 8జీబీ 128జీబీ వేరియంట్ ధర రూ.34,999 కాగా జూలై 18 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద రూ.1,000, బ్యాంక్ డిస్కౌంట్ రూ.2,000 కలిపి మొత్తం రూ.3,000 తగ్గింపు లభిస్తుంది.
రూ.31,999 ధరకే 8జీబీ 128జీబీ వేరియంట్ కొనుగోలు చేయవచ్చు. ఇక 8జీబీ128జీబీ వేరియంట్ ధర రూ.37,999 కాగా జూలై 18 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద రూ.1,000, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్ డిస్కౌంట్ రూ.2,000 కలిపి మొత్తం రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. రూ.34,999 ధరకే 12జీబీ 256జీబీ వేరియంట్ కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఐకూ నియో 7 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ విహాయానికి వస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
పోకో ఎఫ్5 ప్రో, వన్‌ప్లస్ 10టీ, షావోమీ 12 ప్రో లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో వర్చువల్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా 8జీబీ ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫన్‌టచ్ ఓఎస్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 8 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు, 25 నిమిషాల్లో 1 నుంచి 100 శాతం వరకు ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. బ్లూటూత్ 5.2, వైఫై 6, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, మోషన్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఐకూ నియో 7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Related News
Infinix: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ ధరలో రెండు ఫోన్లు లాంచ్..!
టెక్ కంపెనీ ఇన్ఫినిక్స్ (Infinix) తన బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ 'Infinix Note 40 Pro 5G'ని విడుదల చేసింది.