Instagram Reels: ఇంస్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే.. రీల్స్ నిడివి పెంపు!
ఇంస్టాగ్రామ్ వినియోగదారుల కోసం ఇప్పటికే చాలా రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన నిపుణులు తాజాగా మరో ఫీచర్ ని కూడా తీసుకువచ్చారు.
- By Anshu Published Date - 01:04 PM, Fri - 24 January 25

ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఇంస్టాగ్రామ్ ని వినియోగిస్తున్నారు. ఇంకొందరు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఇంస్టాగ్రామ్ వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో రకాల ఫ్యూచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త కొత్త అప్డేట్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు వినియోగాలకు మరో శుభవార్తను చెబుతూ మరో కీలక అప్డేట్ ను తీసుకువచ్చింది. అదేమిటి అన్న విషయానికి వస్తే..
ఇంస్టాగ్రామ్ లో రీల్స్ నిడివిని 3 నిమిషాలకు పెంచుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ ముస్సెరి తెలిపారు. అంటే ఇప్పటి వరకు ఉన్న 90 సెకన్లకు ఇది డబుల్ టైమ్. తమ సృజనాత్మకతను పెంపొందించుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ముస్సెరి తెలిపారు. అయితే ఇన్స్టాగ్రామ్ మాత్రం షార్ట్ ఫామ్ వీడియోలు చేయడానికి కట్టుబడి ఉందని ఆయన పునరద్ఘటించారు. కానీ కంటెంట్ క్రియేటర్ల ఫ్లెక్సిబులిటీని పెంచేందుకు తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని వివరించారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ నిడివి చాలా రెస్టిక్టివ్ గా ఉందని ఫీడ్‌బ్యాక్ వచ్చినట్టు, అందుకు తగ్గట్టుగానే ఈ మార్పులు చేసినట్టు స్పష్టం చేశారు.
ఇకపోతే ఈ నిడివి పెంపు క్రియేటర్లకు ఇది లాభామా? లేక నష్టమా? అన్న విషయానికి వస్తే.. యూజర్ అటెన్షన్ స్పాన్ తగ్గిపోతూ వస్తున్న ఈ కాలంలో షార్ట్ ఫామ్ కంటెంట్‌ని ఇచ్చే సంస్థలు వాటి నిడివిని పెంచుకంటూ వెళుతున్నాయి. యూట్యూబ్ సైతం తన షార్ట్ ఫామ్ కంటెంట్ షార్ట్స్ నిడివిని 1 నిమిషం నుంచి 3 నిమిషాలకు మారుస్తూ 2024 అక్టోబర్ లో నిర్ణయం తీసుకుంది. ఇలా రీల్స్ నిడివిని పెంచడం ఇన్స్టాగ్రామ్ కి కొత్తేమీ కాదు. దాదాపు రెండేళ్ల క్రితం నుంచే 1 నిమిషం 30 సెకన్ల వీడియోలను అప్లోడ్ చేసే అవకాశాన్ని ఇస్తోంది. అంతేకాదు వాస్తవానికి లాంగ్ ఫామ్ వీడియోలను ప్రోత్సహించము అని చెబుతూనే 10 నిమిషాల నిడివి గల రీల్స్ పైనా సంస్థ చాలాసార్లు టెస్టింగ్ చేసింది. కానీ దానిని అమల్లోకి తీసుకురాలేదు. అయితే ఇప్పుడు తాజాగా రీల్స్ డ్యురేషన్ని 3 నిమిషాలకు పెంచింది. మరి రానున్న రోజుల్లో ఈ రీల్స్ నిడివి ఇంకెంత పెరుగుతుందో చూడాలి మరి. అలాగే ఇది కంటెంట్ క్రియేటర్స్‌కి ఎంత మేరకు లాభం చేకురుస్తుందో చూడాలి మరి.