Instagram Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మెసేజింగ్’కు రెక్కలు.. అట్రాక్టివ్‌గా కొత్త ఫీచర్ !
Instagram Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది.
- By Pasha Published Date - 06:13 PM, Fri - 10 November 23

Instagram Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎవరికైనా డైరెక్ట్ మెసేజ్(డీఎం)ను పంపేటప్పుడు అదనపు సౌకర్యాలను కల్పించడమే కొత్త ఫీచర్ ప్రత్యేకత. ఆ అదనపు సౌకర్యాలు ఏమిటంటే.. ఆడియో, ఫోటో, వీడియో, జిఫ్, స్టిక్కర్లు. కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక డైరెక్ట్ మెసేజ్(డీఎం) ఆప్షన్ బలోపేతం అవుతుంది. ఇందులో భాగంగా మనకు ఇక ఆడియో క్లిప్, ఫొటోలు, వీడియో క్లిప్‌లు, జిఫ్‌లు, స్టిక్కర్లను డైరెక్ట్ మెసేజ్‌తో పాటు పంపే వెసులుబాటు కలుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇన్‌స్టాగ్రామ్‌లోని యూజర్స్ మధ్య డైరెక్ట్ మెసేజింగ్ కనెక్టివిటీని ఈ ఫీచర్ మరింత పెంచుతుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ రీల్స్‌కు పాటల సాహిత్యాన్ని కూడా జోడించే వీలు కలుగుతుంది. ఇప్పటివరకు ఈ తరహా ఫీచర్ కేవలం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వివరాలను ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సారి ఇటీవల తన ఛానెల్ వేదికగా వెల్లడించారు. ఈ కొత్త ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. దశలవారీగా కొంతమంది చొప్పున ఇంకొన్ని నెలల్లోనే వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి(Instagram Feature) తీసుకురానున్నారు.