Aadhaar virtual ID: ఇకపై ఆధార్ లేకుండానే ఆ సేవలన్నీ పూర్తి.. ఎలా అంటే?
భారతీయులకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. భారత దేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇటీవల
- By Nakshatra Published Date - 08:50 PM, Wed - 12 July 23
భారతీయులకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. భారత దేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఇటీవల రోజుల్లో ఆధార్ కార్డు అన్నది కీలకంగా మారిపోయింది. గవర్నమెంట్ ప్రైవేట్ ఇలా ప్రతి ఒక్క పనికి ఆధార్ కార్డు అన్నది తప్పకుండా ఉండాల్సిందే. ఆధార్ కార్డు లేనిదే ఏ పని జరగడం లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. బ్యాంక్ ఖాతా ప్రారంభించాలన్న, పాన్ కార్డ్ కావాలన్నా ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ నంబర్ ఉండాల్సిందే. ఇటీవల కాలంలో ఆన్ లైన్ లావాదేవీలు, ఆన్ లైన్ కొనుగోళ్లు అధికమవుతున్నాయి. దీనికి కూడా కొన్ని కంపెనీలు ఆధార్ అథంటికేషన్ అడుగుతున్నాయి. పలు ప్రభుత్వ పథకాలకు ఈ-కేవైసీ చేయడానికి ఆధార్ అవసరం అవుతుంది.
అయితే ప్రతి దానికి ఆధార్ నంబర్ బయట పెట్టకుండా దాని స్థానంలో ఆధార్ వర్చువల్ ఐడీని వినియోగించుకోవచ్చు. అదెలా అంటే.. ఆధార్ వర్చువల్ ఐడీ అనేది తాత్కాలిక నంబర్. ఇది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటుంది. ఇది 16 ర్యాండమ్ సంఖ్యలతో ఉంటుంది. ఏదైనా అథంటికేషన్, ఈ-కేవైసీ చేసే సమయంలో ఆధార్ కు బదులు ఈ వర్చువల్ ఐడీ ని వినియోగించుకోవచ్చు. ఇకపోతే ఆధార్ వర్చువల్ ఐడీని ఎలా జనరేట్ చేయాలి అన్న విషయానికి వస్తే.. ఆధార్ వర్చువల్ ఐడీని జనరేట్ చేయడానికి మీరు ఎస్ఎంఎస్ సర్వీస్ ను వినియోగించుకోవచ్చు. ఆధార్ హెల్ప్ లైన్ నంబర్ 1947 కి మెసేజ్ పంపడం ద్వారా ఏ సమయంలో అయినా ఒక ఆధార్ నంబర్ కు ఒక వర్చువల్ ఐడీ జనరేట్ అవుతుంది.
అలాగే యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా వర్చువల్ ఐడీని జనరేట్ లేదా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఆధార్ నంబర్ , క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేయాలి.అలాగే వినియోగదారులకు వర్చువల్ ఐడీని జనరేట్, రిట్రీవ్ చేసుకోడానికి వివిధ రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ వర్చువల్ ఐడీ మర్చిపోయినా తిరిగే పొందే వీలు ఉంటుంది. అందుకోసం యూఐడీఏఐ వెబ్ సైట్, ఈ-ఆధార్ డౌన్ లోడ్, ఎంఆధార్ మార్గాలను ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ వర్చువల్ ఐడీని రీ జనరేట్ చేయొచ్చు. కానీ అందుకు టైం లిమిట్ ఉంది. కనీస సమయం దాటిన తర్వాత మాత్రమే కొత్త ఐడీ జనరేట్ అవుతుంది. వ్యాలిడిటీ సమయం ఒక రోజు ఉంటుంది. మీరు కొత్త దానికి కోసం ప్రయత్నించినప్పుడు పాతది ఇన్ యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ మీరు కొత్తది కాకుండా పాతదే మళ్లీ కావాలనుకొంటే అందుకోసం RVID అని టైప్ చేసి ఆధార్ కార్డులోని చివరి నాలుగు నంబర్లను జోడించి 1947 కు ఆధార్ కు లింక్ అయ్యి ఉన్న నంబర్ నుంచి మెసేజ్ చేస్తే సరిపోతోంది.
Related News
Aadhaar As Date Of Birth Proof: ఇక నుండి ఆధార్.. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఉత్తర్వులు జారీ..!
లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.