Google Meet : గూగుల్ మీట్‌లో వీడియో కాల్స్ చేస్తారా ? మీ కోసమే సూపర్ ఫీచర్
గూగుల్ మీట్(Google Meet) యాప్‌లో అందుబాటులోకి వచ్చిన రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ జెమినీ ఏఐ మోడల్స్ ఆధారంగా పనిచేస్తుంది.
- By Pasha Published Date - 02:13 PM, Wed - 21 May 25

Google Meet : గూగుల్ మీట్ యాప్‌ను మనలో చాలామంది నిత్యం వినియోగిస్తుంటారు. దీనితో వీడియో కాల్స్ చేస్తుంటారు. ఈ యాప్‌లో గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ పేరుతో ఒక ఫీచర్‌ను యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. రియల్ టైమ్ అంటే అప్పటికప్పుడు లైవ్‌లో అని అర్థం. గూగుల్ వార్షిక డెవలపర్ సమావేశం Google I/O 2025లో రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌కు సంబంధించిన డెమో వీడియోను ఆ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ షేర్ చేశారు. ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Suicide Attack : స్కూలు బస్సుపై సూసైడ్ ఎటాక్.. నలుగురు పిల్లల మృతి, 38 మందికి గాయాలు
రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ గురించి..
- గూగుల్ మీట్(Google Meet) యాప్‌లో అందుబాటులోకి వచ్చిన రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ జెమినీ ఏఐ మోడల్స్ ఆధారంగా పనిచేస్తుంది.
- ఈ ఫీచర్‌ను మనం గూగుల్ మీట్ యాప్‌లోకి వెళ్లి ఎనేబుల్ చేసుకోవాలి.
- ఆ తర్వాతి నుంచి మనం ఎవరితోనైతే వీడియో కాల్‌లో మాట్లాడుతున్నామో వాళ్ల స్వరం, భావోద్వేగం, మాట్లాడే శైలి ఆధారంగా వాయిస్ అనేది అనువాదం అవుతుంది.
- వీడియో కాల్స్‌లో విభిన్న భాషలు మాట్లాడేవారి మాటల్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
- ఉదాహరణకు గూగుల్ మీట్‌లో మనం ఆంగ్లంలో మాట్లాడుతుంటే.. ఎదుట ఉన్న వ్యక్తి అరబిక్‌లో మాట్లాడుతుంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను ఆన్ చేసుకుంటే చాలు.
- ఈ ఫీచర్ ద్వారా ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటలు ఆంగ్లంలోకి అనువాదం అవుతాయి. ఈ సమాచారం కేవలం టెక్ట్స్ రూపంలోనే కాకుండా ఇంగ్లిష్ ఆడియో రూపంలోనూ మనకు లభిస్తుంది.
- ఉదాహరణకు మనం వీడియో కాల్‌లో ఒక అరబిక్ వ్యక్తితో తెలుగులో మాట్లాడుతున్నామని అనుకుందాం. ఈ ఫీచర్ మన తెలుగు మాటలను అరబిక్ భాషలోకి మార్చి , అచ్చం మన లాంటి గొంతుతో ఎదుట ఉన్న వ్యక్తికి ఆడియోను వినిపిస్తుంది. ఇదంతా అప్పటికప్పుడు లైవ్‌లో జరిగిపోతుంది.
- గూగుల్ ఏఐ ప్రో, అల్ట్రా ప్లాన్ సబ్‌స్క్రైబర్లకు రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ టూల్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రస్తుతం ఇంగ్లిష్, స్పానిష్ భాషల అనువాదానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని భాషలకు దీన్ని విస్తరిస్తారు.