Gemini Mobile App : భారత్‌లోకి గూగుల్ ‘జెమిని’ వచ్చేసింది..
గూగుల్ ఏది చేసినా ఒక సంచలనమే. తాజాగా మరో సంచలనానికి గూగుల్ తెరతీసింది.
- By Pasha Published Date - 04:54 PM, Tue - 18 June 24

Gemini Mobile App : గూగుల్ ఏది చేసినా ఒక సంచలనమే. తాజాగా మరో సంచలనానికి గూగుల్ తెరతీసింది. గూగుల్ అభివృద్ధి చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (AI) ఛాట్‌బాట్ జెమిని (Gemini Mobile App) యాప్‌ను కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేశారు. అమెరికా వినియోగదారుల కోసం ఈ యాప్‌ను ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే లాంచ్ చేస్తామని పిచాయ్ తెలిపారు. ఇండియాలోని యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి జెమిని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు,ఉర్దూ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇక ఐఓఎస్ వినియోగదారులు గూగుల్ యాప్ ద్వారా జెమిని ఛాట్ బాట్‌ను యాక్సెస్ చేయొచ్చు.
We’re now on WhatsApp. Click to Join
- జెమిని యాప్ పెద్ద భాషా నమూనాల సామర్థ్యాలకు వినియోగదారులకు యాక్సెస్ అందిస్తుంది.
- జెమిని అడ్వాన్స్‌డ్ – పెద్ద టోకెన్ కాంటెక్స్ట్ విండోతో గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ఎల్ఎల్‌ఎంను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్పారు.
- గూగుల్ మెసేజెస్ యాప్‌లో జెమినిని ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ ప్రకటించింది.
- 6GB RAM లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లు జెమిని ఛాట్ బాట్ సేవలను ఆస్వాదించవచ్చు.
- ఇటీవల కాలంలో ఓపెన్ ఏఐ కంపెనీకి చెందిన ఛాట్ జీపీటీ బాగా ప్రజాదరణ పొందింది.
- ఈనేపథ్యంలో ఛాట్ జీపీటీకి పోటీగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కూడా జెమిన్ ఛాట్ బాట్‌ను రంగంలోకి దింపింది.
Also Read : NEET Paper Leak : ఈడీ ఏం చేస్తోంది.. ‘నీట్’పై ఎందుకు స్పందించడం లేదు : వినోద్‌కుమార్
మన ఫోన్‌కు అనేక కాల్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తుంటాయి. వాటివల్ల మనకు చిరాకు అనిపిస్తుంది. ఇలాంటి కాల్స్ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ చర్యలు చేపట్టింది. దీనికోసం లుకప్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. అన్ నోన్ (తెలియని) కాలర్లను గుర్తించడంలో ఇది సహాయ పడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని ద్వారా యాప్ మారకుండానే కాలర్ సమాచారం తెలుసుకునే వీలుంటుంది.