Flipkart Sale: పోకో స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.4 వేల తగ్గింపు.. ధర, ఫీచర్స్ ఇవే?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు
- By Nakshatra Published Date - 09:15 PM, Thu - 13 July 23
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. వినియోగదారుల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఇలా ఉంటే తాజాగా పోకో సంస్థ పోకో ఎం5 ఫోన్ పై భారీగా తగ్గింపును ప్రకటించింది. ఒకవేళ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.
మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈ ఫోన్ ధర రూ. 12,499 కాగా ఇప్పుడు ఇది రూ. 7,999కే లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ ను అందిస్తోంది. మరో రెండు రోజుల్లో ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. అంతకన్నా ముందే పోకో ఎం5 ఫోన్ ధర తగ్గడం విశేషం. ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్ కొనాలనుకొటుంటే అదికూడా స్టన్నింగ్ ఫీచర్లతో పాటు అనువైన బడ్జెట్లో కావాలనుకొంటే ఈ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కాగా పోకో ఎం5 ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అదిరే డీల్ ప్రకటించింది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ను కేవలం రూ. 8,749కే కొనుగోలు చేయవచ్చు. అలాగే 6జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ను రూ. 10,749కే సొంతం చేసుకోవచ్చు.
అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 759 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈఫోన్ రెండు వేరియంట్లు రూ. 7,999, రూ. 9,999కే లభిస్తోంది. అంతేకాక యాక్సిస్ బ్యాంక్ కార్డుపై కొనుగోలు చేస్తే మరో రూ. 500 తగ్గింపు వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వ్యాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు. దీనిలో అత్యాధిక రేటింగ్ కలిగిన మీడియా టెక్ హీలియో జీ99 చిప్ సెట్ ఉంటుంది. దీంతో ఫోన్ చాలా చురుగ్గా ఉంటుంది. మంచి పనితీరు కనబరుస్తుంది. గేమింగ్ కూడా బాగా సరిపోతోంది. 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో డిస్ ప్లే ఉంటుంది.
6జీబీ ర్యామ్ వేరియంట్ గేమింగ్ సరిగ్గా సరిపోతుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ డిస్ ప్లే ఉంటుంది. 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియా టెక్ హీలియో జీ99 ఎస్ఓసీ చిప్ సెట్ ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్రాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్టు ఉంటుంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్, 2ఎంపీ పోర్ట్ రైట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీ కోసం ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంను కలిగి ఉండనుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూలై 15 నుంచి ప్రారంభం కానుంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.