HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Elon Musk Reveals New Optimus Ai Robot That Can Do Squats And Boil Eggs For You

Musk – Robo : ఈ రోబో గుడ్లు ఉడకబెడుతుంది.. డ్యాన్స్, జిమ్ చేస్తుంది

Musk - Robo : ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ రోబోల తయారీలో దూసుకుపోతోంది.

  • Author : Pasha Date : 13-12-2023 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Musk Robo
Musk Robo

Musk – Robo : ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ రోబోల తయారీలో దూసుకుపోతోంది. ఈ ఏడాది మార్చిలో Optimus Gen 1 అనే రోబోను టెస్లా కంపెనీ విడుదల చేసింది. తాజాగా Optimus Gen 2 రోబోను టెస్లా రిలీజ్ చేసింది. దీని స్పెషాలిటీలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోబో మనుషుల కోసం గుడ్లను ఉడకబెట్టి ఇవ్వగలదు. ఈ రోబో పనితీరును తెలిపే ఒక వీడియోను ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. బౌల్‌లోని కోడిగుడ్లలో ఒకదాన్ని రోబో తన చేతి రెండు వేళ్లతో తీసుకొని  గిన్నెలో వేసి ఉడకబెట్టడాన్ని మనం ఈ వీడియోలో మనం చూడొచ్చు.

Optimuspic.twitter.com/nbRohLQ7RH

— Elon Musk (@elonmusk) December 13, 2023

We’re now on WhatsApp. Click to Join.

ఈ రోబో చేతి మడమ, వేళ్ల కదలికలు చాలా సులువుగా, సాఫీగా జరగడం వీడియోలో కనిపిస్తుంది. ఫలితంగా వస్తువులను సురక్షితంగా పట్టుకునే గ్రిప్ అనేది Optimus Gen 2 రోబోలకు లభించింది. భవిష్యత్తులో రెస్టారెంట్లు, హోటళ్లలో రోబోల వాడకానికి సంకేతం ఇచ్చేలా  Optimus Gen 2 రోబో పనిచేస్తుండటం విశేషం. అంతేకాదు.. Optimus Gen 2 రోబో వ్యాయామం కూడా చేస్తోంది. వ్యాయామానికి సంబంధించిన వివిధ భంగిమలను ది ప్రదర్శించడాన్ని  సైతం మనం వీడియోలో చూడొచ్చు. అచ్చం మనిషిలా డ్యాన్స్ చేసే సామర్థ్యం ఈ రోబోకు ఉందని సైంటిస్టులు అంటున్నారు.

Also Read: WhatsApp Pin Chat : వాట్సాప్ ఛాట్‌లను ఇలా ‘పిన్’ చేసేయండి

టెస్లా కంపెనీ రూపొందించిన మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ‘ఆప్టిమస్’. దీన్ని ‘బంబుల్సీ’ అని కూడా పిలుస్తారు. 2018లో రిలీజైన్ ఫిక్షన్ సినిమా బంబుల్‌బీ (Bumblebee)లోని రోబో క్యారెక్టర్ పేరును దానికి పెట్టారు.  ‘బంబుల్సీ’ రోబోను 2021 సెప్టెంబరులో ఆవిష్కరించారు. బంబుల్‌బీతో పోలిస్తే ఇప్పుడు తీసుకొచ్చిన Optimus Gen 2 రోబో చాలా అడ్వాన్స్‌డ్.  Optimus Gen 1 రోబోతో పోలిస్తే Optimus Gen 2 రోబోలో మెరుగైన బ్యాలెన్స్ ఉంటుంది. దీనికి శరీరంపై పూర్తి నియంత్రణ ఉంటుంది. చలాకీగా నడవగలదు. AI టెక్నాలజీని వాడుకొని ఇది పనిచేయగలదు. అవసరమైతే నడక వేగాన్ని పెంచగలదు. Optimus Gen 1 రోబోతో పోలిస్తే Optimus Gen 2 రోబో(Musk – Robo) బరువును 10 కిలోలు తగ్గించారు. నడకలో వేగాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Boil Eggs
  • elon musk
  • Musk - Robo
  • Optimus AI Robot
  • Squats

Related News

Elon Musk

జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!

Elon Musk  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదుపులకు గురవుతున్న వేళ, సంక్షోభంలో ఉన్న గ్లోబల్ ఎకానమీకి చైనా, భారత్‌లు కీలక చోదక శక్తులుగా మారాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంపై టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ప్రపంచంలో ఆర్థిక శక్తి క్రమంగా చైనా, భారత్ చేతుల్లోకి వెళుత

  • Meta Can Read Private WhatsApp Chats

    వాట్సాప్ పై ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్

Latest News

  • T20 వరల్డ్‌కప్‌కి అంతా సిద్ధం

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు

  • ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు

  • రాజకీయాలను నేరమయం చేసిందే వైసీపీనే – చంద్రబాబు

  • కశ్మీర్‌లో భూకంపం

Trending News

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd