WhatsApp Pin Chat : వాట్సాప్ ఛాట్లను ఇలా ‘పిన్’ చేసేయండి
WhatsApp Pin Chat : త్వరలోనే వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. అదే ‘వాట్సాప్ పిన్ ఛాట్’ !!
- By Pasha Published Date - 09:33 AM, Wed - 13 December 23
WhatsApp Pin Chat : త్వరలోనే వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. అదే ‘వాట్సాప్ పిన్ ఛాట్’ !! దీని ద్వారా మనం మిత్రులు, సన్నిహితుల నుంచి వచ్చే వ్యక్తిగత వాట్సాప్ మెసేజ్‌లను పిన్ చేసి.. ఛాట్ ఫీడ్ ఎగువ భాగంలో కనిపించేలా హైలైట్ చేయొచ్చు. ఆ మెసేజ్ ఎంత టైం పాటు హైలైట్ అయి ఉండాలనేది కూడా డిసైడ్ చేయొచ్చు. 24 గంటలు, 7 రోజులు, 30 రోజులు ఇలా మనకు ఇష్టం వచ్చిన టైం వ్యాలిడిటీని మనం నిర్ణయించవచ్చు. ఇక వాట్సాప్ గ్రూప్‌లోనూ మనం ఏదైనా మెసేజ్‌ను పిన్ చేయొచ్చు. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. మెసేజ్‌లను పిన్ చేసే వెసులుబాటును వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులందరికీ కల్పించాలా ? వద్దా ? అనేది గ్రూప్ అడ్మిన్లు డిసైడ్ చేయాల్సి ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇలా పిన్ చేయాలి
- ఈ ఫీచర్‌ను వాడేందుకుగానూ మీరు పిన్ చేయాల్సిన వాట్సాప్ ఛాట్‌ను నొక్కి పట్టుకోండి.
- అనంతరం త్రీ డాట్స్‌లోకి వెళ్లి ‘పిన్’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- అనంతరం ‘పిన్’ చేసే వాట్సాప్ ఛాట్‌ను ఎంత టైం పాటు హైలైట్ చేయాలనే టైం లిమిట్‌ను ఎంపిక చేయండి.
- ఆ తర్వాత మీరు పిన్ చేసిన ఛాట్ అనేది .. వాట్సాప్ ఫీడ్‌లో ఎగువ భాగంలో హైలైట్ అవుతుంది. ఈ కొత్త ఫీచర్‌లోని మరో విశేషం ఏమిటంటే.. మీరు టెక్స్ట్, పోల్, ఇమేజ్‌లు, ఎమోజీల వంటి సందేశాలను కూడా పిన్ చేయొచ్చు. ఇలా పిన్ చేసే చాట్లు(WhatsApp Pin Chat) అన్ని ఇతర సందేశాల మాదిరిగానే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్‌గా సేఫ్‌గా ఉంటాయి.
Also Read: Israel Vs Gaza : సొంత బలగాల దాడిలో ఇజ్రాయెలీ సైనికుల మృతి!
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్‌గా మారింది.