Grok 3 AI : ‘గ్రోక్ 3’ ఛాట్‌బోట్ వచ్చేసింది.. ఏమిటిది ?
‘గ్రోక్ 3’ ఏఐ ఛాట్‌బోట్‌ను ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్టప్ xAI(Grok 3 AI) అభివృద్ధి చేసింది.
- By Pasha Published Date - 12:11 PM, Tue - 18 February 25

Grok 3 AI : అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీ రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఆయనకు చెందిన ‘ఎక్స్‌ఏఐ’(xAI) కంపెనీ ‘గ్రోక్ 3’ పేరుతో అధునాతన ఏఐ ఛాట్ బోట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భూమిపై అత్యంత తెలివైన ఏఐ ఇదేనని టెక్ నిపుణులు అంటున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఇవాళ (మంగళవారం) ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ‘గ్రోక్ 3’ ఏఐ మోడల్‌ను విడుదల చేశారు. ఎక్స్‌ఏఐలోని ముగ్గురు ఇంజినీర్లతో కలిసి గ్రోక్3 చాట్‌బాట్ విశేషాలను ఎలాన్ మస్క్ మీడియాకు వెల్లడించారు. ఇంతకీ ఏమిటీ ‘గ్రోక్ 3’ ఏఐ ? ఇదెలా పనిచేస్తుంది ? వివరాలివీ..
Also Read :Harish Rao: 11 ఏళ్ల కిందటి ఫొటోతో హరీశ్‌రావు ట్వీట్.. వివరాలివీ
‘గ్రోక్ 3’ ఏఐ ఛాట్‌బోట్ గురించి..
- ‘గ్రోక్ 3’ ఏఐ ఛాట్‌బోట్‌ను ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్టప్ xAI(Grok 3 AI) అభివృద్ధి చేసింది.
- సోషల్ మీడియాలో ఛాట్ చేయడానికి ఈ ఛాట్ బోట్ ఉపయోగపడుతుంది.
- ప్రధానంగా సోషల్ మీడియా వేదిక X (గతంలో ట్విట్టర్) ద్వారా దీన్ని వాడుకోవచ్చు.
- రియల్ టైం సమాచారాన్ని పొందేందుకు ఎక్స్ యూజర్లకు ఇది పనికొస్తుంది.
- “గ్రోక్” అనే పదాన్ని రాబర్ట్ హీన్లీన్ రాసిన “స్ట్రేంజర్ ఇన్ ఎ స్ట్రేంజ్ ల్యాండ్” నవల నుంచి సేకరించారు. ఏదైనా విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడం అనేది ఈ పదం అర్థం.
- టెక్ట్స్-టు-వీడియో వంటి అధునాతన ఫీచర్లను గ్రోక్3 కలిగి ఉంది.
- ఓపెన్ ఏఐ కంపెనీకి చెందిన ఛాట్ జీపీటీ-4, గూగుల్‌కు చెందిన జెమిని, మెటా(ఫేస్‌బుక్) కంపెనీకి చెందిన ఎల్‌ఎల్‌ఎఎంఎ సిరీస్ వంటి ఏఐ మోడళ్లకు ప్రధాన పోటీదారుగా గ్రోక్ 3 నిలువనుంది.
- వాస్తవానికి xAI కంపెనీకి చెందిన గ్రోక్1 ఏఐ ఛాట్‌బాట్‌ను 2023 నవంబరులో విడుదల చేశారు. తరువాత గ్రోక్ 2ను రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్రోక్ 3 విడుదలైంది.
Also Read :RBIs New Rule: బ్యాంకు బిచాణా ఎత్తేస్తే.. ఖాతాదారులకు ఎంత ఇస్తారు.. కొత్త అప్‌డేట్
- గ్రోక్-1 అనే భాషా నమూనాపై ఆధారపడి గ్రోక్ 3 ఏఐ ఛాట్‌బోట్ పనిచేస్తుంది. ఇది 33 బిలియన్ పారామితులను కలిగి ఉంది.
- కుబెర్నెట్స్, JAX, రస్ట్‌లను కలిగి ఉన్న కస్టమ్ టెక్ స్టాక్‌ను ఉపయోగించి రెండు నెలల్లోనే గ్రోక్ 3 ఛాట్‌బోట్‌ను అభివృద్ధి చేశారు.
- గ్రోక్-3 అనేది గ్రోక్-2 కంటే 10 రెట్లు ఎక్కువ కంప్యూటింగ్ శక్తిని కలిగి ఉంటుంది.
- ఇప్పుడున్న ఇతరత్రా ఛాట్‌బోట్‌ల కంటే గ్రోక్3.. 10 రెట్లు ఎక్కువ పనితీరు కనబరుస్తుంది.
- వారం రోజుల్లో వాయిస్ ఇంటరాక్షన్ ఫీచర్‌ను గ్రోక్3లో అందుబాటులోకి తేనున్నారు.
- ఈ రోజు నుంచి ‘ఎక్స్’లో ప్రీమియం+ సబ్‌స్క్రైబర్లకు గ్రోక్3 సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ధర ప్రస్తుతం భారత్‌లో నెలకు రూ.1750.
- కొత్త ఫీచర్లు కోరుకునే వారికోసం సూపర్‌గ్రోక్ పేరిట ఓ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌నూ ఎక్స్ కంపెనీ తీసుకొచ్చింది.