Kekius Maximus : ఎలాన్ మస్క్ పేరు ఇక ‘కేకియస్ మాక్సిమస్’.. ఎందుకు ?
ఇంతకీ ‘కేకియస్ మాక్సిమస్’(Kekius Maximus) పేరుకు అర్థమేంటో తెలుసుకునేందుకు యత్నించారు.
- By Pasha Published Date - 05:28 PM, Tue - 31 December 24

Kekius Maximus : ట్విట్టర్ (ఎక్స్) యజమాని, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే ! న్యూ ఇయర్ సమీపించిన వేళ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘ఎక్స్’లోని తన అకౌంటులో పేరును మార్చేసుకున్నాడు. ఎక్స్ ఖాతాలో తనకు ‘కేకియస్ మాక్సిమస్’ అని పేరు పెట్టుకున్నాడు. ఇంతకీ ఏమిటీ పేరు ? దాని అర్థమేంటి ?
2025 is gonna be so lit 🔥🔥🇺🇸🇺🇸 https://t.co/GUUaTsiYi2
— Kekius Maximus (@elonmusk) December 31, 2024
Also Read :Country Wise New Year: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగా, ఆలస్యంగా జరిగే దేశాలివీ
ఎలాన్ మస్క్ తన ఎక్స్ అకౌంటులో పేరును మార్చుకోగానే అందరూ దానిపై డిస్కషన్ మొదలుపెట్టారు. ఇంతకీ ‘కేకియస్ మాక్సిమస్’(Kekius Maximus) పేరుకు అర్థమేంటో తెలుసుకునేందుకు యత్నించారు. కేకియస్ అనేది క్రిప్టో కరెన్సీ టోకెన్. ఇథేరియం, సొలానా అనే బ్లాక్ చైన్ వేదికల్లో కేకియస్ ట్రేడింగ్ జరుగుతుంటుంది. డిసెంబరు 27వ తేదీ నాటికి కేకియస్ అనే క్రిప్టో కరెన్సీ టోకెన్ రూ.48 వద్ద ట్రేడ్ అయ్యింది. డిసెంబరు 27న దాని ధర ఏకంగా 500 శాతం మేర పెరిగింది. ఆ రోజున కేవలం 24 గంటల వ్యవధిలో కేకియస్ క్రిప్టో కరెన్సీ టోకెన్‌లో దాదాపు రూ.23 కోట్ల ట్రేడింగ్ జరిగింది. దీంతో అది వార్తల్లో నిలిచింది. పెట్టుబడిదారులు, క్రిప్టో కరెన్సీపై ఆసక్తి కలిగిన వర్గాల్లో దానికి సంబంధించిన టాపిక్స్ చర్చనీయ అంశాలుగా మారాయి. అందుకే ఇప్పుడు తన ఎక్స్ అకౌంటులో ‘కేకియస్ మాక్సిమస్’ అనే పేరును ఎలాన్ మస్క్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మస్క్ ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం కాదు. 2023 సంవత్సరంలోనూ తన ఎక్స్ అకౌంటుకు ఆయన ‘మిస్టర్ ట్వీట్’ అని పేరును మార్చుకున్నారు. ఎన్నో వ్యాపారాలు చేస్తూ.. రాజకీయాల్లో తలదూరుస్తూ బిజీగా ఉన్నా ఎలాన్ మస్క్ ఇలాంటి క్రియేటివ్ ఎక్స్ పోస్టులతో నిత్యం నెటిజన్లతో టచ్‌లో ఉంటారు.
Also Read :Drunker Thief : దొంగతనానికి వెళ్లి.. వైన్‌షాపు, బ్యూటీ పార్లర్‌లలోనే నిద్రపోయారు
జనవరి 19న అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపడతారు. ఆయన ప్రభుత్వంలోని ఎఫీషియెన్సీ విభాగానికి ఎలాన్ మస్క్ సారథ్యం వహించబోతున్నారు. ఇటీవలే ఎన్నికల్లో తన గెలుపునకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రతిఫలంగా ఈ పదవిని మస్క్‌కు ట్రంప్ కట్టబెట్టారు. అమెరికా ప్రభుత్వ శాఖల్లో దుబారాను నివారించడం, పొదుపు చర్యలను అమలు చేయడం ఎఫీషియెన్సీ విభాగం బాధ్యత.