HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Technology
  • ⁄Elon Musk %e0%b0%b8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d %e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b1%82%e0%b0%95%e0%b1%8d %e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d %e0%b0%b8%e0%b1%8a

Elon Musk: స్నైల్‌ బ్రూక్ : మస్క్ సొంతంగా నిర్మించనున్న మహా నగరం విశేషాలు

టెక్సాస్ రాజధాని ఆస్టిన్ వెలుపల కొత్తగా కొనుగోలు చేసిన 3,500 ఎకరాల పచ్చిక బయళ్ళు , వ్యవసాయ భూములలో తన సొంత పట్టణాన్ని నిర్మించాలని మస్క్ యోచిస్తున్నాడు. దానికి స్నైల్‌బ్రూక్ అనే పేరు కూడా డిసైడ్ చేశాడట.

  • By Hashtag U Published Date - 07:16 AM, Mon - 13 March 23
Elon Musk: స్నైల్‌ బ్రూక్ : మస్క్ సొంతంగా నిర్మించనున్న మహా నగరం విశేషాలు

Elon Musk: అపర కుబేరుడు ఎలోన్ మస్క్ ఏది చేసినా సంచలనమే..

ఆయనకు మరో కొత్త ఐడియా వచ్చింది..

టెక్సాస్ రాజధాని ఆస్టిన్ వెలుపల కొత్తగా కొనుగోలు చేసిన 3,500 ఎకరాల పచ్చిక బయళ్ళు , వ్యవసాయ భూములలో తన సొంత పట్టణాన్ని నిర్మించాలని మస్క్ యోచిస్తున్నాడు. దానికి స్నైల్‌బ్రూక్ అనే పేరు కూడా డిసైడ్ చేశాడట.

మస్క్ కు చెందిన టెస్లా మరియు స్పేస్‌ఎక్స్‌ కంపెనీలకు అవసరమైన అన్ని వనరులు ఆస్టిన్ నగరానికి దగ్గరలోనే ఉన్నాయి.

ఈనేపథ్యంలో మస్క్ నిర్మించనున్న కొత్త నగరం టెస్లా , స్పేస్‌ఎక్స్‌ కంపెనీల ఉద్యోగుల కోసమేనని అంటున్నారు. అక్కడ 100కిపైగా ఇండ్లను నిర్మించాలని మస్క్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ స్విమ్మింగ్ పూల్ , అవుట్‌డోర్ స్పోర్ట్స్ ఏరియా కూడా ఉంటాయని అంటున్నారు.

ఈ మస్క్ టౌన్ లో నిర్మించే
రెండు లేదా మూడు పడకగదుల ఇంటి అద్దెలు నెలకు రూ.66వేలు ( $800 )కు పైనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక్కడి ఇళ్లను కంపెనీ ఉద్యోగులకు మాత్రమే విక్రయించే ఛాన్స్ ఉంది.
ఇక్కడికి సమీపంలోని బాస్ట్రాప్‌ టౌన్ లో మధ్యస్థ అద్దె నెలకు రూ.1.80 లక్షలు( $2,200) ఉంది.. ఈ లెక్కన మస్క్ నిర్మించే స్నెయిల్‌బ్రూక్‌ టౌన్ లో నివసించే కార్మికులు మార్కెట్ కంటే తక్కువ అద్దెలనే చెల్లిస్తారు.  ఈ పట్టణంలో ఒక మాంటిస్సోరి పాఠశాల కూడా ఉంటుందట.

2020లో  కాలిఫోర్నియా స్టేట్ అమలుచేసిన కరోనా సంబంధిత ఆంక్షలతో మస్క్ నిరాశ చెందారు.

ఆ సమయంలోనే టెస్లా యొక్క ప్రధాన కార్యాలయాన్ని , అతని వ్యక్తిగత నివాసాన్ని కాలిఫోర్నియా నుండి టెక్సాస్‌కు మారుస్తానని మస్క్ ప్రకటించాడు . ఆ ప్రకటన కు కార్యరూపే ఈ కొత్త నగరమని పరిశీలకులు చెబుతున్నారు.

ఈక్రమంలోనే గత సంవత్సరమే టెస్లా కంపెనీ ఆస్టిన్‌లో కొత్త గిగాఫ్యాక్టరీని ప్రారంభించింది.

■మార్క్ క్యూబన్ .. మరో మస్క్

ఇలా స్వంత నగరాన్ని కలిగిన బిలియనీర్ మస్క్ ఒక్కడే కాదు..
2021లో డల్లాస్ మావెరిక్స్ యజమాని మార్క్ క్యూబన్  టెక్సాస్‌లోని ముస్టాంగ్ పట్టణం మొత్తాన్ని రూ.16 కోట్లకు  కొనుగోలు చేశారు.ఆ నగరం 2017 నుంచి అమ్మకానికి ఉంది. వాస్తవానికి దీని ధర 4 మిలియన్ డాలర్లు. ఇది చివరికి 2 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ముస్తాంగ్ టౌన్ నవారో కౌంటీలోని డల్లాస్‌కు దక్షిణంగా ఒక గంట దూరంలో ఉంది. ఇది 77 ఎకరాలలో ఉంది.

Tags  

  • elon musk
  • Elon Musk city'tesla
  • SpaceX
  • viral
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Naatu Naatu: ఢిల్లీని ఊపేస్తున్న ‘నాటు నాటు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!

Naatu Naatu: ఢిల్లీని ఊపేస్తున్న ‘నాటు నాటు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!

ఢిల్లీలో జర్మనీ, ఇండియా సిబ్బంది కలసి నాటు నాటు పాటకు అదిరిపొయే డాన్స్ చేశారు. క్రేజీ స్టెప్పులతో దుమ్మురేపారు.

  • Romantic Monkey: ఈ కోతి భలే చిలిపి.. అమ్మాయి షార్ట్ పైకి లేపి, ముద్దుపెట్టి!

    Romantic Monkey: ఈ కోతి భలే చిలిపి.. అమ్మాయి షార్ట్ పైకి లేపి, ముద్దుపెట్టి!

  • Hardik Pandya: హార్థిక్ అప్పుడే అంత తలకెక్కిందా?

    Hardik Pandya: హార్థిక్ అప్పుడే అంత తలకెక్కిందా?

  • Snow Leopard: లడఖ్ లో మంచు చిరుత వేట.. వీడియో ఇదిగో!

    Snow Leopard: లడఖ్ లో మంచు చిరుత వేట.. వీడియో ఇదిగో!

  • Serial Kisser: ముద్దులు పెడతాడు.. పారిపోతాడు, ‘సీరియల్ కిస్సర్’ వీడియో వైరల్

    Serial Kisser: ముద్దులు పెడతాడు.. పారిపోతాడు, ‘సీరియల్ కిస్సర్’ వీడియో వైరల్

Latest News

  • Silver Turtle: వెండి తాబేలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే?

  • Sri Ram Navami is Coming: రామజన్మ భూమిలోని రాముడి ఆలయానికి సంబంధించిన వివరాలివీ

  • Australia vs India: ఆస్ట్రేలియాదే వన్డే సీరీస్.. బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన భారత్

  • KCR @ Maharashtra: మహారాష్ట్ర లో కేసీఆర్ మరో సభ, 26న లక్ష మందితో..

  • Chandra Babu to Assembly: అనురాధ కోసం అసెంబ్లీకి చంద్రబాబు, వైసీపీకి టెన్షన్

Trending

    • Odisha Temple: ఎలుకలతో దేవతమూర్తులకు నిద్రాభంగం.. అలర్ట్ అయిన పూజారులు!

    • Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

    • Umesh Chandra:వైఎస్ రాజారెడ్డికి సంకెళ్లు వేసిన గ్రేట్ ఐపీఎస్

    • MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!

    • Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: