Congenital Squint : మెల్లకన్ను ఉంటే ఎలా ? ఏం చేయాలి ?
చాలామందికి మెల్లకన్ను ఉంటుంది. దీన్నే ఇంగ్లిష్‌లో ‘స్క్వింట్ ఐ’ అని పిలుస్తారు.
- By Pasha Published Date - 03:04 PM, Thu - 16 May 24

Congenital Squint : చాలామందికి మెల్లకన్ను ఉంటుంది. దీన్నే ఇంగ్లిష్‌లో ‘స్క్వింట్ ఐ’ అని పిలుస్తారు. మన కంటిలోని కనుగుడ్లు రెండు కూడా సమన్వయంతో ఎదుట ఉన్న సీన్‌ను చూసేందుకు.. కంటి వెనక 6 కండరాలు ఉంటాయి. వాటిలో సమస్య వచ్చినప్పుడే.. రెండు కనుగుడ్లలో సమన్వయం లోపిస్తుంది. దీనివల్ల ఒక్కో కనుగుడ్డు.. ఒక్కో వైపునకు చూస్తుంటుంది. దీన్నే మనం మెల్లకన్ను అని చెబుతుంటాం. దీనికి చికిిత్స ఉందా ? లేదా ? అనే దానిపై వైద్య నిపుణుల విశ్లేషణను ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
మెల్లకన్నుకు(Congenital Squint) చికిత్స చేయొచ్చని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు.సర్జరీలతో మెల్లకన్నును సరిచేయొచ్చని అంటున్నారు. మెల్ల కన్ను ఉన్నప్పుడు చూడడానికి ఎక్కువగా ఒక కంటినే వాడుతుంటారని తెలిపారు. ఉదాహరణకు కుడి వైపు కంటితో చూస్తున్నప్పుడు ఎడమవైపు కంటికి మెల్ల ఉంటుంది. ఎడమవైపు కంటితో చూసినప్పుడు కుడి వైపు కంటికి మెల్ల ఉంటుంది. మెల్లకన్ను ఉన్నవాళ్లు ఒకవేళ రెండు కళ్లతో ఒకేసారి చూసేందుకు యత్నిస్తే.. మెదడు దాన్ని రెండు వస్తువుల్లాగా చూపిస్తుంది.అందుకే మెల్లకన్ను ఉన్నవారు త్రీ డైమెన్షన్స్‌ను చూడలేరు. త్రీడీ సినిమాలను చూస్తే ప్రత్యేక అనుభూతిని ఆస్వాదించలేరు.
Also Read : Covaxin : కొవాగ్జిన్ టీకాతోనూ సైడ్ ఎఫెక్ట్స్.. బనారస్ హిందూ వర్సిటీ స్టడీ రిపోర్ట్
కొందరు పిల్లలకు పుట్టగానే మెల్లకన్నును గుర్తించలేము. వారు పెరిగేకొద్ది మెల్లకన్ను బయటపడుతుంది. దీన్ని ఆంబ్లీయోపియా అని పిలుస్తారు. మెల్లకన్ను వస్తే అదృష్టమని చెబుతుంటారు. వాస్తవానికి మెల్లకన్ను ఉన్న పిల్లలను చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోకుంటే వారు పెరిగే కొద్దీ పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇటీవల లండన్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈవిషయం వెల్లడైంది. 40 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న 1, 26000 మందిపై పరిశోధనలు చేయగా 3వేల మంది చిన్నప్పుడు మెల్లకన్నుతో బాధపడినట్లు వెల్లడైంది. అలాంటి వారిలోనే గుండె పోటు ప్రమాదంతో పాటుగా హైబీపీ, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. 82 శాతం మంది పెద్దయ్యాక ఒక కంటి చూపును కూడా కోల్పోయారని శాస్త్రవేత్తలు గుర్తించారు.