Sanchar Saathi: స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ తో విసిగిపోయారా.. ఈ యాప్ తో ఇకమీదట వాటికీ చెక్ పెట్టండి!
మొబైల్ ఫోన్ వినియోగదారులు విసిగిపోతున్న స్పామ్ కాల్స్, స్కామ్ కాల్స్ ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర టెలీకాం శాఖ సంచార్ సాథీ పేరుతో ఒక మొబైల్ యాప్ ను ప్రారంభించింది.
- By Anshu Published Date - 02:00 PM, Fri - 24 January 25

ఇటీవల కాలంలో మోసపూరిత కాల్స్, మెసేజెస్ ఎక్కువ అయిపోయిన విషయం తెలిసిందే. సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అలాంటి మోసపూరిత కాల్స్ బారిన పడకుండా ఉండాలంటే హెచ్చరిస్తూనే ఉంది. కానీ సైబర్ నేరగాళ్ళు మాత్రం సరికొత్తగా మోసాలకు పాల్పడుతున్నారు., అయితే ఇక మీదట ఈ మోసాలు జరగకుండా ఉండడం కోసం టెలి కమ్యూనికేషన్ విభాగం సంచార్ సాథీ మొబైల్ యాప్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఉత్తమ మొబైల్ ఫోన్ కాల్ లాగ్స్ నుంచి నేరుగా మోస పూరిత కాల్స్ ని మెసేజెస్ ని ఫ్లాగ్ చేయవచ్చట. సంచార్ సాథీ యాప్ ఇప్పుడు లైవ్ లో ఉంది. టెలీకాం శాఖ సంచార్ సాథీ పోర్టల్ ను 2023 లోనే ప్రారంభించింది. అయితే తాజాగా ఈ యాప్ (APPS) ద్వారా యూజర్లు తక్షణమే, సులభంగా, తమ మొబైల్ ఫోన్ కాల్ లాగ్స్ నుంచి మోసపూరిత కమ్యూనికేషన్లను రిపోర్ట్ చేయడానికి వీలవుతుందట. సంచార్ సాథీ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.
కాగా ఈ సంచార్ సాథీ ప్రోగ్రామ్ ప్రతి కస్టమర్ గోప్యతను, భద్రతను పరిరక్షించే సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది అని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. విజన్ ఫర్ నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ 2.0, డిజిటల్ భారత్ నిధి నిధులతో 4జీ మొబైల్ సైట్లలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ వంటి మరో రెండు కార్యక్రమాలను సింధియా ప్రారంభించారు. కాబట్టి వెంటనే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మోసపూరిత కాల్స్ మెసేజ్లకు చెక్ పెట్టండి. ఇప్పటికే ఈ యాప్ ని చాలామంది వినియోగిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసేసుకోండి.