Samsung: శాంసంగ్ ఫోన్లలో సెర్చింజిన్ గా బింగ్.. ఇక గూగుల్ పని అయిపోయినట్టేనా?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ పని అయిపోయినట్టే అని తెలుస్తుంది. తెలియని విషయాలను కూడా తెలుసుకునేలా చేస్తుంది గూగుల్ తల్లి.
- By Nakshatra Published Date - 08:36 PM, Mon - 17 April 23
Samsung: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ పని అయిపోయినట్టే అని తెలుస్తుంది. తెలియని విషయాలను కూడా తెలుసుకునేలా చేస్తుంది గూగుల్ తల్లి. ఇప్పుడు అటువంటి గూగుల్ కు కష్టకాలం వచ్చింది. ఒకప్పుడు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఒపెరా, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వంటివి అందుబాటులో ఉండేవి. ఇక ఎప్పుడైతే గూగుల్ అడుగుపెట్టిందో ఇక అప్పటినుంచి అవన్నీ కనిపించకుండా పోయాయి.
అయితే ఇప్పుడు మరో కొత్త ఫీచర్ రావటంతో గూగుల్ కూడా కాస్త కష్టకాలంలో ఉన్నట్లు తెలుస్తుంది. గత కొంత కాలం నుంచి ఆన్లైన్ సమాచారం శోధనలో గూగుల్ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. అయితే ఇప్పుడు చాట్ జీపీటీ రూపంలో ముప్పు ముంచుకొస్తుందని తెలుస్తున్నాయి. చాట్ జీపీటీ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మైక్రోసాఫ్ట్ వల్ల గూగుల్ కు ఎదురుదెబ్బ ఎదురయ్యింది.
ఎందుకంటే చాట్ జీపీటీ లో ఏ సమాచారం కావాలన్నా క్లుప్తంగా దొరకటంతో యూజర్ లంతా దానివైపే అడుగులు వేస్తున్నారు. పైగా మైక్రోసాఫ్ట్ సొంత సెర్చింజన్ బింగ్ లో చాట్ జీపీటీని విస్తరించింది. అందుకు యూజర్లు బింగ్ ను ఫాలో అవుతున్నారు. దీంతో ఇతర టెక్ సంస్థలు కూడా తమ గాడ్జెట్స్ లో డిఫాల్ట్ సెర్చింజన్ గా గూగుల్ కి బదులు బింగ్ ను జత చేయాలి అని కోరుతున్నాయి.
అయితే ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం గత ఏడాదిలో శాంసంగ్ 251 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను సరఫరా చేయగా.. ఇందులో గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్ మాత్రమే ఉన్నాయి. దీంతో ఆ ఫోన్లను వినియోగదారులకు అందించే ముందు గూగుల్, మైక్రోసాఫ్ట్ యాప్స్, ఇతర సేవలను అందిస్తున్నారు. అయితే తాజాగా సెర్చింజన్ విషయంలో కూడా శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదేంటంటే తమ ఫోన్లలో గూగుల్ సెర్చింజన్ కి బదులు మైక్రోసాఫ్ట్ సెర్చింజన్ బింగ్ ను డిఫాల్ట్ సెర్చింజన్ గా ఇచ్చేటట్లు చర్చలు చేస్తున్నారని తెలుస్తుంది. ఒకవేళ ఇది జరిగితే మాత్రం గూగుల్ కి రూ.300 కోట్ల నష్టం రావడం ఖాయమని తెలుస్తుంది.
Tags
Related News
Free Screen Replacement : ఆ ఫోన్లు వాడుతున్నారా ? ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్
Free Screen Replacement : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా ? అయితే మీకే ఈ శుభవార్త.