Amazon Republic Day Sale: అమెజాన్లో రిపబ్లిక్ సేల్.. ఆ స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన ఆఫర్స్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. జనవరి 13 నుంచి ఈ అమెజాన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఆఫర్లో భాగంగా స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ లభిస్తున్నాయి.
- By Anshu Published Date - 01:03 PM, Mon - 13 January 25

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లు ప్రస్తుతం పండుగ సేల్ తో పాటు రిపబ్లిక్ సేల్ ను అందిస్తున్నాయి. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ పండుగ అనంతరం రిపబ్లిక్ సేల్ మొదలుకానుంది. ఇందులో భాగంగానే కొన్ని స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ లో తక్కువ ధరకే అద్భుతమైన ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ సేల్ ఈవెంట్ ఎంతకాలం కొనసాగుతుందనే వివరాలను అమెజాన్ ఇంకా వెల్లడించలేదు. అయితే, కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ ధృవీకరించింది.
వన్‌ప్లస్ నార్డ్ 4 వంటి ప్రముఖ మిడ్ రేంజ్ ఫోన్ల నుంచి ఐక్యూ 13 వంటి ప్రీమియం ఫోన్ ల వరకు అమెజాన్ అనేక పాపులర్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. అయితే అమెజాన్ ఇంకా అన్ని స్మార్ట్‌ఫోన్ ల ధర వివరాలను వెల్లడించలేదు. అయితే గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్ లతో లభించే ఫోన్ ల పేర్లను ధృవీకరించింది. ఇందులో వన్‌ప్లస్ 13, ఐఫోన్ 15, ఐక్యూ జెడ్9ఎస్, వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ 13ఆర్, పోకో ఎక్స్6, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్, పోకో ఎక్స్6 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎమ్35 5జీ, రెడ్‌మి ఎ4 వంటి ఫోన్లు ఉన్నాయి.
ఈ ఫోన్లపై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది అన్న విషయాన్ని మాత్రం అమెజాన్ సంస్థ వెల్లడించలేదు. అమెజాన్ వన్‌ప్లస్ 13 సేల్ ఆఫర్‌ను ఇంకా వెల్లడించనప్పటికీ, ఇప్పుడే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ బ్రాండ్ అన్ని అధీకృత ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లాంచ్ ఆఫర్‌లను అందిస్తోంది. వన్‌ప్లస్ 13 వినియోగదారుల కోసం రూ. 5 వేలవరకు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తోంది. వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్ కొనుగోలుదారులు రూ. 3వేల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇప్పుడు, లాంచ్ ఈవెంట్ సందర్భంగా వన్‌ప్లస్ ప్రకటించిన అదే ఆఫర్లను అమెజాన్ డిస్‌ప్లే చేస్తుందో లేదో చూడాలి మరి. వన్‌ప్లస్ 13 ఫోన్ రూ. 69,999 వద్ద లాంచ్ అయింది. వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్ రూ. 42,999 ధరకు లాంచ్ అయింది. అమెజాన్ లో ఐఫోన్ 15 ధర రూ. 60వేల లోపు ఉండవచ్చు. ప్రస్తుతం అమెజాన్ లో అదే ఫోన్ రూ. 60,499 వద్ద జాబితా అయింది. ఈ ఫోన్ సేల్ ధర రూ. 60వేల కన్నా తక్కువగా ఉండవచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ కూడా తగ్గింపును పొందుతుందో లేదో ప్రస్తుతానికి తెలియదు. తక్కువ ధరకు లేటెస్ట్ ఐఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే యూజర్లు విజయ్ సేల్స్ పై డీల్‌లను చెక్ చేయవచ్చు.