Amazon Offer: రూ.31,999 ల 5జీ ఫోన్ కేవలం రూ.8,290, కే.. ఎలా అంటే?
ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ఆయా కంపెనీలు ఎన్నో రకాల అద్భుతమైన
- By Anshu Published Date - 07:30 AM, Mon - 9 January 23

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ఆయా కంపెనీలు ఎన్నో రకాల అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఫోన్ల పై భారీగా ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్ లపై భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్ సంస్థ 5జీ స్మార్ట్ ఫోన్ ని అతి తక్కువ ధరకే అందిస్తోంది. రూ. 31,999 ఉన్న స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 8290 కే లభిస్తోంది. మరిన్ని వివరాల విషయానికి వస్తే.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఒప్పో స్మార్ట్ ఫోన్లపై మంచి ఆఫర్లను అందిస్తోంది.
ఒప్రోవర్స్ డేస్ పేరిట జనవరి 5 నుంచి జనవరి 10వ తేదీ వరకూ ఈ ఆఫర్లను కొనసాగించనుంది. అయితే ఇందులో చాలా ఫోన్ ల ఆఫర్లను ప్రకటించింది. ఈ డీల్స్ లో ఆకట్టుకున్న ఆఫర్ ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ. కాగా ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్ తో పాటు 128 జీజీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. అలాగే అమెజాన్ ఒప్పో వర్స్ డేస్ సేల్ లో భారీ తగ్గింపు తోపాటు ఏదైనా పాత ఫోన్ ఎక్స్ చేంజ్ తో అతి తక్కువ ధరకు అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ. 6,009 డిస్కౌంట్ తో రూ. 25,990 కి లభిస్తుంది. అంతే కాక పలు బ్యాంక్ ఆఫర్లు వర్తిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ తో కనీసం రూ. 5000 , ఆపై లావాదేవీపై 10 శాతం డిస్కౌం తో గరిష్టంగా రూ. 2500 వరకూ తగ్గింపు వస్తుంది.
అలాగే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కనీసం రూ. 12,000, అంతకన్నా ఎక్కువ ధరతో లావాదేవి జరిపితే 7.5 శాతం తగ్గింపు ఉంటుంది. అలాగే హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఏదైనా పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ ఛేంజ్ చేస్తే రూ. 15,200 వరకూ లభిస్తుంది. సాధారణంగా వస్తున్న డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స ఛేంజ్ అన్నీ కలిపితే ఈ ఫోన్ కేవలం రూ. 8290కే దక్కుతుంది.