Mobile Offers : సెల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్ ఇవే?
ప్రతినెల మంత్ ఎండ్ సేల్స్ లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఎలక్ట్రానిక్ డివైసెస్ పై భారీ రాయితీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.
- By Anshu Published Date - 08:00 PM, Thu - 28 July 22

ప్రతినెల మంత్ ఎండ్ సేల్స్ లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఎలక్ట్రానిక్ డివైసెస్ పై భారీ రాయితీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల కూడా ఇలాంటి భారీ డిస్కౌంట్లతో పలు ఫోన్లను అమ్మకంలో పెట్టారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు తక్కువ ధరకే అత్యధిక ఫీచర్లు కలిగిన అధునాతన సెల్ఫోన్లను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అమెజాన్ Saleలో భాగంగా ఖరీదైన ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
Month End Salesలో భాగంగా ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. వన్‌ప్లస్, షావోమీ, శాంసంగ్ ఎం13 సిరీస్,టెక్నో, ఒప్పో,రియల్‌మీ, వివోతో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ అమ్మకాలపై 40% డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం ఈ సేల్స్ పై 40% డిస్కౌంట్ మాత్రమే కాకుండా డెబిట్ క్రెడిట్ కార్డుల పై అదనపు 10% రాయితీ పొందవచ్చు. సిటీ బ్యాంక్ కార్డుపై 5000 రూపాయల ట్రాన్సాక్షన్ చేస్తే పదివేల రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు.
ఇకపోతే Amazon Prime Membership ఉన్నవారు 20000 ఆదా చేసుకొనేలా 6 నెలలపాటు ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. అదేవిధంగా మరో మూడు నెలల పాటు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై నో కాస్ట్ ఈఎంఐ, ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై స్పెషల్ కూపన్ కోడ్ వినియోగించుకునే సదుపాయం ఉంది.. ఈ మంత్ ఎండ్ సెల్స్ లో భాగంగా ఐఫోన్ 13,ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌పై రూ.10వేల వరకు డిస్కౌంట్ పొందే సౌకర్యం కల్పించారు. వీటితోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎం 53, శాంసంగ్ గెలాక్సీ ఎం 33 పై రూ.9వేల వరకు ఆఫర్, లేటెస్ట్‌గా విడుదలైన శాంసంగ్ ఎం 13పై రూ.2వేల వరకు డిస్కౌంట్ ఉన్నట్లు అమెజాన్ ప్రకటించింది.