POCO X5 Pro 5G: మార్కెట్ లోకి పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో తాజాగా పోకో ఎక్స్5 ప్రో 5జీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా
- By Anshu Published Date - 07:00 AM, Tue - 14 February 23
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో తాజాగా పోకో ఎక్స్5 ప్రో 5జీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫిబ్రవరి 13వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. మరి తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ పోకో ఎక్స్5 ప్రో 5జి ధర, ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పొకో ఎక్స్5 ప్రో 5జి , 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999 గా ఉంది. అలాగే 8జిబి ర్యామ్ , 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. పోకో ఈ ఫోన్‌తో హెచ్ డిఎఫ్, ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది.
ఈ బ్యాంకులకు చెందిన క్రెడిట్ , డెబిట్ కార్డ్ లావాదేవీల ద్వారా హ్యాండ్‌సెట్ తీసుకోవడంపై ఫ్లాట్ రూ. 2000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందే వీలుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ పోకో ఎక్స్5 ప్రో 5జి స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. పొకో, తాజా ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్ 6.67అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 ఇది పూర్తి HD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ప్రదర్శన డాల్బీ విజన్, HDR10+ కంటెంట్ వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది.
ఫోన్ ఓఐఎస్ సపోర్ట్‌తో 108 మెగాపిక్సెల్ సాంసంగ్ HM2 సెన్సార్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్‌లో 2 మెగాపిక్సెల్ మాక్రో , 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ పోకో ఫోన్‌లో సెల్ఫీ , వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కొత్త పొకో ఎక్స్5 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరి సామర్థ్యంను కలిగి ఉండ నుంది.