Medaram
-
#Telangana
KCR: సమ్మక్క సారలమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కేసీఆర్
KCR: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళా గా ప్రసిద్ధిగాంచిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో, సమ్మక్క సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి […]
Date : 22-02-2024 - 5:26 IST -
#Speed News
Medaram: మేడారం మహాజాతర ఎఫెక్ట్, ఆ ఐదు రోజులు విద్యాసంస్థలు బంద్
రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారానికి పోటెత్తారు. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరగనున్నందున ములుగు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక ఐదో రోజు ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో మొత్తంగా ఐదు రోజులు సెలవులు […]
Date : 21-02-2024 - 6:19 IST -
#Telangana
Medaram Bus Accident : మేడారం జాతర ప్రారంభం..వరుసగా ఆర్టీసీ బస్సుల ప్రమాదం
మేడారం (Medaram) మహా జాతర ప్రారంభం వేళ..వరుసగా ఆర్టీసీ బస్సులు (RTC Bus Accidents) ప్రమాదానికి గురి కావడం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణలో అతి పెద్ద మహా కుంభవేళ గా భావించే మేడారం జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈరోజు నుండి ఈ మహాజాతర మొదలైంది. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈజాతరలో ప్రధాన ఘట్టం మొదటి రోజు అనగా బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి […]
Date : 21-02-2024 - 3:34 IST -
#Telangana
Medaram : మేడారం జాతర సందర్భాంగా ప్రధాని మోడీ ట్వీట్
మేడారం (Medaram) మహాజాతర సందర్బంగా ప్రధాని మోడీ ట్వీట్ చేసి భక్తులను ఆకట్టుకున్నారు. తెలంగాణలో అతి పెద్ద మహా కుంభవేళ గా భావించే మేడారం జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈరోజు నుండి ఈ మహాజాతర మొదలైంది.ఈ సందర్భాంగా ప్రధాని మోడీ (PM Modi) తెలుగు లో ఈ మహాజాతర గురించి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క-సారక్క […]
Date : 21-02-2024 - 9:50 IST -
#Speed News
Sajjanar: మేడారం జాతర కారణంగా సాధారణ రూట్లలో బస్సులు తగ్గాయి : సజ్జనార్
మేడారం మహాజాతరకు తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆ జాతర కోసం వివిధ ప్రాంతాల నుంచి 6 వేల స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. దీనివల్ల సాధారణ రూట్లలో సర్వీసులు తగ్గిపోయాయి. దీనివల్ల మామూలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. జాతర పూర్తయ్యేవరకు సాధారణ ప్రజలు తగు ఏర్పాట్లు […]
Date : 20-02-2024 - 10:43 IST -
#Telangana
Medaram: ఆరోజే మేడారంలో తొలి మరో ఘట్టం.. సమ్మక్క ఆగమనం కోసం భారీ ఏర్పాట్లు
Medaram: మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం. అమ్మల రాక ఘట్టం తో… భక్తులకు కలిగే అద్భుత అనుభూతి అనిర్వచనీయం. లక్షలాది మంది భక్తులు తమ హృదయంలో సమ్మక్క-సారలమ్మను నింపుకొని మొక్కులు చెల్లించే దృశ్యాన్ని కళ్లారా చూడాలి తప్ప వర్ణించలేం. సమ్మక్క, సారలమ్మ పూజారులను (వడ్డెరలు) ఒప్పించి అమ్మవార్లను గద్దెకు తీసుకురావడం అధికార యంత్రాంగానికి విధిగా అనాదిగా వస్తున్న ఆచారం. ఆ సమయంలో దేవతల ఆగమనం కోసం పడిగాపులు కాసే లక్షలాది మంది […]
Date : 20-02-2024 - 6:07 IST -
#Telangana
Minister Konda Surekha : లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేస్తున్న మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) గత వారం రోజులుగా డెంగ్యూ జ్వరం (Dengue Fever)తో బాధపడుతున్నారు. కనీసం లేవలేని పరిస్థితి ఉన్నారు. అయినప్పటికీ తన బాధ్యత ను నిర్వర్తిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. తెలంగాణ మహా జాతర మేడారం ఉత్సవాలు సందర్బంగా మంత్రి సురేఖ..కొద్దీ రోజులుగా మేడారం ఏర్పాట్లలో బిజీ గా ఉన్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..తమ ప్రభుత్వ హయాంలో మొదటిసారి మేడారం […]
Date : 20-02-2024 - 12:10 IST -
#Telangana
Medaram : మేడారం జాతర సందర్బంగా 4 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు…
మేడారం (Medaram) మహా జాతర రేపటి నుండి మొదలుకాబోతుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర.. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. కాలినడకన, ఎడ్లబండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్ లోను మేడారం జాతరకు భక్తులు వస్తారంటే జాతర ఎంతగా ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారం […]
Date : 20-02-2024 - 11:36 IST -
#Speed News
Medaram: వనదేవతలను దర్శించుకున్న డీజేపీ రవిగుప్తా, పోలీస్ అధికారులు
తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్త, అడిషనల్ డీజీపీ ఇంటిలిజెన్స్ బి శివధర్ రెడ్డి లు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారళమ్మ జాతర సందర్శించి వనదేవతలకు సోమవారం నాడు మొక్కులు చెల్లించారు. అనంతరం నోడల్ అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. జాతర సందర్భంగా డిజిపి రవి గుప్తా మాట్లాడుతూ…. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర సమ్మక్క సారలమ్మ జాతర అని రెండు కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రాబోవు నాలుగు రోజులు […]
Date : 19-02-2024 - 11:03 IST -
#Telangana
Medaram: మేడారం భక్తులకు TSRTC గుడ్ న్యూస్, ఇంటి వద్దకే ప్రసాదం
Medaram: ఆసియాలోనే అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకను చూసి తరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని… నిలువెత్తు బంగారం సమర్పించుకుంటారు. దాదాపు కోటి మంది వరకు ఈ జారతకు హాజరవుతారు. కానీ… కొన్ని కారణాల కారణంగా… జాతరకు వెళ్లలేని వారు ఎంతో మంది. జాతరను కళ్లారా చూడలేకపోయినా… అమ్మవార్ల మహా ప్రసాదం అయితే దక్కితే చాలనుకునే వారు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారి కోసం […]
Date : 16-02-2024 - 11:23 IST -
#Telangana
Medaram: మేడారం జాతరకు TSRTC ప్రత్యేక బస్సులు.. వివరాలు ఇదిగో
తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 51 సెంటర్ల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. అందులో ఉమ్మడి వరంగల్ లోనే 22 సెంటర్లుండగా.. వరంగల్ నగరంలోని మూడు ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. ఈ మేరకు మేడారం జాతరకు రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ అధికారులు ఛార్జీలు కూడా నిర్ణయించారు. […]
Date : 15-02-2024 - 8:04 IST -
#Speed News
Medaram: మేడారం భక్తులకు గుడ్ న్యూస్, జాతరలో ప్రత్యేక మొబైల్ యాప్ ప్రారంభం
Medaram: నిత్యం వేల మంది భక్తులు మేడారం వెళ్లి వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర జరిగే ఐదు రోజుల్లో కోటి మందికిపైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భక్తుల కోసం అధికారిక వెబ్‌సైట్, ఆండ్రాయియ్ యాప్‌ను విడుదల చేసింది. వీటిలో మేడారం జాతరకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. మేడారం అధికారిక వెబ్‌సైట్ https://www.medaramjathara.com , ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ను ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆవిష్కరించారు […]
Date : 12-02-2024 - 11:59 IST -
#Telangana
Medaram Jatara : మేడారంలో ధరల మోత..గగ్గోలు పెడుతున్న భక్తులు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర (Medaram Jatara) గా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పేరుంది. ఈ జాతర కు అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి..మొక్కులు తీర్చుకుంటారు. ఈ నెల 21 నుంచి 24 వరకూ మేడారం మహాజాతర జరగనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచే గాక, ఇతర రాష్ట్రాల వారూ కుటుంబ సమేతంగా వస్తున్నారు. మొదట జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవార్లకు […]
Date : 11-02-2024 - 5:55 IST -
#Speed News
Medaram: మేడారం భక్తులకు గుడ్ న్యూస్, ఆన్ లైన్ సేవలు ప్రారంభం
Medaram: సమ్మక్క సారక్కల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడాన్ని భక్తులు ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతరకు వెళ్ళలేని భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారి గద్దెల వద్ద సమర్పించే సేవలను బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సురేఖ ప్రారంభించారు. తన మనవడు కొండా మురళీకృష్ణ పేరును మీ సేవ వెబ్సైట్ లో నమోదు చేసి, బరువు ప్రకారం డబ్బులు చెల్లించి అమ్మవారి […]
Date : 08-02-2024 - 9:42 IST -
#Speed News
Medaram: మేడారం జాతరకు అంకురార్పణ, గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం
Medaram: మేడారం మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరిగింది. గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం మొదలవుతుంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగే తంతు నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ది కార్యక్రమం జరిగింది. తరువాత మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ , కొండాయిలోని గోవిందరాజు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజారులు శుద్ది చేసారు. సమ్మక్క గద్దెను ఎర్రమట్టితో అలుకు చల్లి రంగుల ముగ్గులతో అలంకరణ చేసారు. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన […]
Date : 07-02-2024 - 11:52 IST