-
##Speed News
Andhra pradesh: రెండో ఒమిక్రాన్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళను ఒమిక్రాన్ పాజిటివ్ గా గుర్తుంచారు. పాజిటివ్ వచ్చిన మహిళాకు కాంటాక్ట్ అయిన వారందరికి టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసుల సంఖ్య పెరిగితే కంటైన్ మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్యూలు వంటి కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
Updated On - 12:47 PM, Wed - 22 December 21