HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >World Test Championship Points Table After Ind Vs Ban Test

World Test Championship: వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌లో దూసుకెళ్లిన టీమిండియా.. ఫైన‌ల్ బెర్త్ ఖాయమా..?

కాన్పూర్ టెస్టుకు ముందు భారత జట్టు పాయింట్ల శాతం (PCT) 71.67గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత అది ఇప్పుడు 74.24కి పెరిగింది. మరోవైపు బంగ్లాదేశ్ ఇప్పుడు నేరుగా ఏడో స్థానానికి దిగజారింది.

  • Author : Gopi Date : 01-10-2024 - 5:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Test Championship
World Test Championship

World Test Championship: కాన్పూర్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి 2-0తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 95 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. మ్యాచ్‌లో రెండు, మూడో రోజు వరుసగా రెండు రోజులు వర్షం కురిసినా.. ఇలాంటి ఫలితం వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ రోహిత్ సేన ఆ పని చేసింది.

ఈ విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship) పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా సరికొత్త శిఖరాగ్రాన్ని చేరుకుంది. మరోవైపు బంగ్లాదేశ్‌ జట్టు ఘోరంగా ఓడిపోయింది. కాన్పూర్ టెస్టుకు ముందు భారత జట్టు పాయింట్ల శాతం (PCT) 71.67గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత అది ఇప్పుడు 74.24కి పెరిగింది. మరోవైపు బంగ్లాదేశ్ ఇప్పుడు నేరుగా ఏడో స్థానానికి దిగజారింది.

Also Read: Delhi: వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సీఎం..అడ్డుకున్న పోలీసులు..

కంగారూ జట్టు రెండో స్థానంలో ఉంది

మిగిలిన‌ జట్ల గురించి చెప్పాలంటే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. జట్టు PCT ప్రస్తుతం 62.50. WTC ఫైనల్‌కు ముందు కంగారూ జట్టు భారత్, శ్రీలంకలతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. కాగా ఈ పట్టికలో శ్రీలంక జట్టు 55.56 PCTతో మూడో స్థానంలో ఉంది. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం ఈ మూడు జట్లకే ఫైనల్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇతర జట్ల పరిస్థితి ఏమిటి?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ జట్టు 42.19 విజయ శాతంతో నాలుగో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు PCT 38.89తో ఐదవ స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ జట్టు 37.50 PCTతో ఆరో స్థానంలో ఉంది. WTC ఫైనల్‌కు పాకిస్తాన్, వెస్టిండీస్‌ల అవకాశాలు దాదాపు ముగిశాయి. ఆ జ‌ట్ల‌ PCT వరుసగా 19.05, 18.52 వద్ద ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • IND vs BAN
  • indian cricket team
  • srilanka
  • World Test Championship
  • WTC Points Table

Related News

'Best gift ever!'... Waiting to see how Rajkummar Rao beats my 'cover drive': Sourav Ganguly

Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘దాదా’గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే సౌరవ్ గంగూలీకి తన పుట్టినరోజున ఒక మర్చిపోలేని బహుమతి లభించింది. గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు ఆయన 54వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చిందని, ఇది తనకు లభించి

  • Why are plumbers respected more than engineers in the country? An Indian in Australia can earn ₹67 lakh per year.

    Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd