World Cup Points Table: వన్డే ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు ఇవే.. రెండో స్థానంలో టీమిండియా..!
2023 ప్రపంచకప్‌లో 18వ మ్యాచ్‌లో పాకిస్థాన్ 62 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టిక (World Cup Points Table)లో నాలుగో స్థానంలో నిలిచింది.
- By Gopichand Published Date - 08:34 AM, Sat - 21 October 23

World Cup Points Table: 2023 ప్రపంచకప్‌లో 18వ మ్యాచ్‌లో పాకిస్థాన్ 62 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టిక (World Cup Points Table)లో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా ఓడిన పాకిస్థాన్ ఐదో స్థానానికి పడిపోయింది. టోర్నీలో రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కంగారూ జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే దీని తర్వాత ఆ జట్టు పునరాగమనం చేసి తదుపరి రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టు శ్రీలంకను ఓడించింది.
పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మొత్తం నాలుగు మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లు, నెట్ రన్ రేట్ +1.923తో అగ్రస్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత టీమ్ ఇండియా 8 పాయింట్లతో, నెట్ రన్ రేట్ +1.659 తో రెండవ స్థానంలో ఉంది. దీని తర్వాత దక్షిణాఫ్రికా 3లో 2 విజయాల తర్వాత 4 పాయింట్లు, రన్ రేట్ +1.385తో మూడవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 4 మ్యాచ్ లలో 2 విజయాల తర్వాత 4 పాయింట్లు, -0.193 రన్ రేట్‌తో నాల్గవ స్థానంలో నిలిచింది.
We’re now on WhatsApp. Click to Join.
మిగతా జట్ల పరిస్థితి
పాకిస్తాన్ 4 మ్యాచ్ లలో 2 గెలిచి 4 పాయింట్లు, నెగెటివ్ రన్ రేట్ -0.456తో పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. దీని తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 3 మ్యాచ్‌ల తర్వాత 2 పాయింట్లు, నెగెటివ్ -0.084 నెట్ రన్‌రేట్‌తో ఆరో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 4 మ్యాచ్‌లలో 2 పాయింట్లతో -0.784 నెగెటివ్ నెట్ రన్‌రేట్‌తో ఏడవ స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ 4 మ్యాచ్‌లలో 2 పాయింట్లతో నెట్ రన్‌రేట్ -0.993తో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 4 మ్యాచ్‌లలో నెగెటివ్ -1.250 నెట్ రన్ రేట్‌తో 2 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. శ్రీలంక ఏ మ్యాచ్ గెలవకుండా పదో స్థానంలో ఉంది. టోర్నీలో ఇప్పటివరకు ఏ మ్యాచ్‌లోనూ గెలవని ఏకైక జట్టు శ్రీలంక.