Google Doodle : గూగుల్ డూడుల్ చూశారా ? గుకేష్ దొమ్మరాజు, డింగ్ లిరెన్‌లకు అరుదైన గౌరవం
దీన్ని పురస్కరించుకొని చెస్ కాయిన్స్‌తో ఆకట్టుకునే డూడుల్‌ను గూగుల్(Google Doodle) తయారు చేయించింది.
- By Pasha Published Date - 01:59 PM, Mon - 25 November 24

Google Doodle : ప్రతిరోజూ ‘గూగుల్ సెర్చ్’ హోం పేజీలో పబ్లిష్ అయ్యే ‘గూగుల్ డూడుల్’ గురించి మనకు తెలుసు. గూగుల్ డూడుల్ ప్రతిరోజూ స్పెషలే. ఎందుకంటే ప్రతి రోజూ భిన్నమైన గూగుల్ డూడుల్‌ను డిస్‌ప్లే చేస్తారు. తాజాగా ఇవాళ (నవంబరు 25న) చెస్ గేమ్‌కు సంబంధించిన డూడుల్‌ను గూగుల్ ప్రచురించింది. ‘ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ – 2024’ ఇవాళ సింగపూర్‌లో ప్రారంభం అవుతోంది. దీన్ని పురస్కరించుకొని చెస్ కాయిన్స్‌తో ఆకట్టుకునే డూడుల్‌ను గూగుల్(Google Doodle) తయారు చేయించింది. దీని ద్వారా ఈసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తలపడుతున్న గుకేష్ దొమ్మరాజు (భారత ప్లేయర్), డింగ్ లిరెన్ (చైనా ప్లేయర్)లను సత్కరించింది. భారతదేశం తరఫున ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో డి. గుకేష్ పాల్గొంటున్నారు. ఆయన ప్రస్తుత చెస్ వరల్డ్ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌తో గేమ్‌లో తలపడుతున్నారు. పద్దెనిమిదేళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ గుకేష్ దొమ్మరాజు ఫిడే (FIDE) వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కారు. కాగా, డిసెంబరు 13 వరకు సింగపూర్‌లో ఈ పోటీలు కొనసాగుతాయి.
Also Read :MLC Kavitha : తెలంగాణలో ‘కుల గణన’ కోర్టుల్లో నిలుస్తుందా.. సర్కారు చెప్పాలి : కవిత
చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఇలా జరుగుతుంది ?
- చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ప్రతి ఒక్క మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్స్‌తో 14 రకాల క్లాసికల్ చెస్ గేమ్స్‌ను ఆడిస్తారు. ఈ మ్యాచ్‌లు అన్ని కలుపుకొని తొలుత 7.5 పాయింట్లు సాధించిన వారే విజేతగా నిలుస్తారు.
- తొలి 40 సార్లు పావులు కదిపేందుకు 120 నిమిషాల టైం కేటాయిస్తారు. వాటికి అదనంగా గేమ్ ముగిసే వరకు మరో 30 నిమిషాలు కేటాయిస్తారు.
- 41వ సారి పావులు కదపడం ఆరంభించినప్పటి నుంచి.. ఒక్కోసారి పావును కదిపేందుకు 30 సెకండ్ల ఇంక్రిమెంట్ ఇస్తారు.
- 41వ పావు కంటే ముందు మ్యాచ్‌ను డ్రాగా ముగించడానికి ప్లేయర్‌ను టోర్నీ నిర్వాహకులు అనుమతించరు.
- ప్రతీ మ్యాచ్‌లో భాగంగా 14 గేమ్స్ ఆడిన తర్వాత ఇద్దరు ప్లేయర్స్ కూడా ముందుకు సాగలేకపోతే.. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను టై బ్రేక్‌గా ప్రకటిస్తారు. తదుపరిగా విన్నర్ తేలే వరకు వరుసగా ఐదు రౌండ్ల దాకా ప్లే ఆఫ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే వాటిలో టైం కంట్రోల్ ఉంటుంది. ఆ టైంలోగా మ్యాచ్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది.