Hardik Pandya: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆడను.. కారణం చెప్పిన హార్దిక్ పాండ్యా..!
భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో తనను తాను టీమిండియా జట్టులో ఉంచలేదు. టెస్టు టీమ్‌లో స్థానం సంపాదించేందుకు కష్టపడాల్సి ఉందని పాండ్యా చెప్పాడు.
- By Gopichand Published Date - 11:28 AM, Fri - 17 March 23

భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో తనను తాను టీమిండియా జట్టులో ఉంచలేదు. టెస్టు టీమ్‌లో స్థానం సంపాదించేందుకు కష్టపడాల్సి ఉందని పాండ్యా చెప్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించిన తర్వాత భారత్ వరుసగా రెండోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించింది. జూన్ 7న టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ సందర్భంలో భారత్‌కు ఆల్ రౌండర్ అవసరం. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దీని గురించి మాట్లాడాడు. ఆల్ రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ పేరును రోహిత్ చర్చించాడు. అయితే అభిమానులు మరోసారి హార్దిక్ పాండ్యాను టెస్ట్ జట్టులో చూడాలనుకుంటున్నారు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి వన్డేకు ముందు విలేకరుల సమావేశంలో హార్దిక్ పాండ్యాను దీన్ని గురించి ప్రశ్నించగా.. నేను నైతికంగా చాలా బలమైన వ్యక్తిని. నేను అక్కడికి చేరుకోవడానికి 10 శాతం పని చేయలేదు. వాస్తవంగా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు నేను ఒక్క శాతం కూడా కృషి చేయలేదు. కావును నేను ఇప్పుడు వెళ్లి మరొకరి స్థానాన్ని భర్తీ చేయడం సరికాదు. నేను డబ్ల్యూటీసీ ఫైనల్ కు అందుబాటులో ఉండను. నన్ను నేను నిరూపించుకునేదాకా భవిష్యత్ లో కూడా టెస్టులు ఆడను అని సమాధానమిచ్చాడు.
Also Read: All England Badminton: పుల్లెల గోపీచంద్ కూతురు గాయత్రి సంచలనం.. ప్రి క్వార్టర్స్ లో గెలుపు
హార్దిక్ పాండ్యా తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను సెప్టెంబర్ 2018లో ఇంగ్లాండ్‌లో ఆడాడు. ఆ తర్వాత అతను వెన్నునొప్పి కారణంగా టెస్ట్ జట్టుకు దూరంగా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా గాయం నుండి తిరిగి వచ్చిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. అయితే అతను టెస్టు క్రికెట్‌కు తిరిగి రావడానికి ఇంకా సిద్ధం కాలేదు. అతను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు కాబోయే కెప్టెన్‌గా కూడా కనిపిస్తున్నాడు.

Related News

IPL 2023: ఐపీఎల్ తొలి మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేయగల ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2023 (IPL 2023)లో తొలి మ్యాచ్ చెన్నై, గుజరాత్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ సహా ఐదుగురు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయగలరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మొదటి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.