WI vs IND 2nd Test: నిరాశలో టీమిండియా
వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో మొదటి టెస్ట్ గెలిచి 1-0 ఆధిక్యం ప్రదర్శిస్తుంది భారత జట్టు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్లు చితకొట్టారు
- Author : Praveen Aluthuru
Date : 19-07-2023 - 3:59 IST
Published By : Hashtagu Telugu Desk
WI vs IND 2nd Test: వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో మొదటి టెస్ట్ గెలిచి 1-0 ఆధిక్యం ప్రదర్శిస్తుంది భారత జట్టు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్లు చితకొట్టారు. జైస్వాల్, రోహిత్ శర్మ చెరో సెంచరీ బాదగా, స్పిన్ మాంత్రికుడు అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు రోజుల్లో 12 వికెట్లు తీసుకుని కరేబియన్లను వణికించేశాడు. అశ్విన్ కి తోడు జడేజా విజ్రంభించాడు. మొత్తానికి ఈ నలుగురి భాగస్వామ్యంతో టీమిండియా మొదటి టెస్టులో విజయం సాధించింది. ఇదిలా ఉండగా రేపు జూలై 20న ఓవల్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో వాతావరణ శాఖ షాకిచ్చింది. తొలిరోజు మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలు కావొచ్చు. లేదా మ్యాచ్ రద్దయినా ఆశ్చర్యం లేదు.
రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తొలి టెస్టును కేవలం మూడు రోజుల్లోనే ముగించింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టులోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది.ఈ సమయంలో ఐఎండీ రిపోర్ట్ టీమిండియా ఆటగాళ్లను కాస్త నిరాశకు గురి చేసినట్టేనని అభిప్రాయ పడుతున్నారు క్రికెట్ ఎనలిస్టులు.
Read More: Top Mystery : KCR నోట రేవంత్ రెడ్డి పేరు ఎందుకు రాదు..? అదేం మిస్టరీ.!