Bumrah:టీమిండియా బౌలర్ బుమ్రాకే ఎందుకిలా..?
టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకే ఎందుకిలా అవుతోంది. గాయాల కారణంగా ఆసియా కప్-2022కు దూరమైన బుమ్రా..
- By Hashtag U Published Date - 12:37 PM, Mon - 3 October 22

టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకే ఎందుకిలా అవుతోంది. గాయాల కారణంగా ఆసియా కప్-2022కు దూరమైన బుమ్రా.. స్ట్రెస్ రియాక్షన్ వలన టీ20 ప్రపంచకప్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయితే బుమ్రా గత కొంతకాలంగా గాయాల బారిన పడుతూనే ఉన్నాడు. టీమిండియా పేస్ విభాగంలో బుమ్రా ఉంటే అటు భారత్ జట్టుకు.. ఇటు ఫ్యాన్స్‌కు బలం. అయితే బుమ్రా కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్నాడు.
బుమ్రా గాయాల కారణంగా దూరమైన కొన్ని సిరీస్‌లను ఇప్పుడు ఓ సారి చూద్దాం. 2018వ సంవత్సరంలో టీమిండియా, ఇంగ్లండ్ జట్టుతో ఆడే సమయంలో బుమ్రాకు బోటనవేలి గాయం కావడంతో 3 వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పటంతో ఆ సిరీస్‌కు దూరమయ్యాడు. తర్వాత 2019వ సంవత్సరంలో వెస్టిండీస్ సిరీస్‌లో వెన్నెముక గాయం కారణంగా 3 నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.
ఇకపోతే.. ఈఏడాది జరిగిన ఆసియా కప్‌కు వెన్నెముక గాయం కావటంతో ఒక నెల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం ఆసీస్‌తో జరిగిన టీ20 పోరులో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే సౌతాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక చేసిన మొదటి టీ20కు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. రెండో టీ20 కోసం ప్రాక్టీస్ చేసే సమయంలో మరోసారి గాయపడ్డాడు. దీంతో 4 నుంచి 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు బుమ్రాకు సూచించారు. దీంతో బుమ్రా అక్టోబర్ 16వ తేదీన ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు.