Mohammed Shami: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. షమీ కూడా కష్టమే..?
ఇటీవల ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ (Mohammed Shami) అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీ అగ్రస్థానంలో నిలిచాడు.
- By Gopichand Published Date - 07:03 PM, Sat - 2 December 23
Mohammed Shami: ఇటీవల ప్రపంచకప్‌లో మహమ్మద్ షమీ (Mohammed Shami) అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే రానున్న రోజుల్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మహమ్మద్ షమీ టీమిండియా జెర్సీలో కనిపిస్తాడా? అయితే ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ అని సమాచారం. వార్తా సంస్థ PTI ప్రకారం.. మహ్మద్ షమీ చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతను వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆడలేడని సమాచారం.
T20 ప్రపంచ కప్ 2024 జట్టులో మహమ్మద్ షమీ భాగమవుతాడా?
అయితే 2024 టీ20 ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ ఆడుతాడా? అనేది సందేహంగా ఉంది. మహ్మద్ షమీ ఐపీఎల్ 2024 సీజన్లో మెరుగ్గా రాణిస్తే అతను టీ20 ప్రపంచకప్ జట్టులో భాగం కాగలడని నమ్ముతారు. భారత జట్టు ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. ఇది కాకుండా ఆస్ట్రేలియాతో 2 టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. మహమ్మద్ షమీ ఈ సిరీస్‌లో ఆడనున్నాడు. అయితే అతను వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు చాలా తక్కువ.
Also Read: T20 World Cup 2024: కోహ్లీని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందా..?
దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో మహ్మద్ షమీ దూరం
2023 ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఈ భారత ఫాస్ట్ బౌలర్ తన పేరిట 24 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు ముందుగా టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. డర్బన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టుకు మహ్మద్ షమీ ఎంపిక కాలేదు. ప్రస్తుతం మహ్మద్ షమీ వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఆడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2024లో మహ్మద్ షమీ బాగా బౌలింగ్ చేస్తే, టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక అవుతాడని తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
Related News
Team India Squad: ఏ ఫ్రాంచైజీ నుండి ఎంతమంది ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కింది..?
పీఎల్ 2024 మధ్య టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ అధికారులు ప్రకటించారు. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో జట్టు చాలా సమతుల్యంగా కనిపిస్తుంది.